Tuesday, March 21, 2023

విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిన మేడారం

- Advertisement -

lights

మన తెలంగాణ/మేడారం : ఆసియా ఖండంలోనే మహా జాతరగా సాగిన మేడా రం విద్యుత్ వెలుగులతో అలరారుతుంది. వరాల తల్లులు గద్దెలకు చేరుకునే సందర్బాన్ని పురస్కరించుకుని అధికారులు గద్దెల ప్రాంగణంలో వివిధ రకాల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటుగా తల్లుల గద్దెలను పూవులతో సుందరంగా అలంకరించారు. తల్లులు కొలువై ఉన్న గద్దెలు దీప్యమనమైన వెలుగులతో భక్తుల ను రంజింప చేశాయి. అంతటి సుందరమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. సుందరమైన తల్లులు కోలువైన గద్దెలకు చేరుకున్న భక్తులు అక్కడే ఉంటూ తనివితీరా దర్శించుకున్నారు. దీంతో భక్తులు క్యూలైన్లలో పోటెత్తారు. భక్తులను గద్దెలపై నుంచి భక్తులను పంపించేందుకు పోలీసుల తరం కాలేక పోయింది. మేడారం పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలో సమ్మక్క సారలమ్మ గద్దెలు, భక్తులతో కిక్కిరిసిన  జంపన్నవాగు నుంచి గద్దెల వద్దకు వస్తున్న రోడ్లు, ఆర్టీసీ ప్రాంగణం తదితరల చిత్రాలను బందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles