Home మెదక్ ఉమ్మడి రాష్ట్రంలో…తెలంగాణకు తీవ్ర అన్యాయం

ఉమ్మడి రాష్ట్రంలో…తెలంగాణకు తీవ్ర అన్యాయం

opening

* నేడు అభివృద్ధిలో దూసుకు పోతున్న రాష్ట్రం
* మే నుంచి రైతుల ఖాతాల్లో కి 4వేలు
* డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

మన తెలంగాణ/రామాయంపేట : ఆంధ్రపాలకుల పాలన లో తెలంగాణ ఎంతో వెనుక బాటుకు గురైందని  డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజాంపే ట మండల కేంద్రంతో పాటు చల్మెడ, నస్కల్ గ్రామాల్లోని పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు చేశారు. మొదట చల్మెడలో రోడ్డులో రూ.కోటి 40లక్షల తో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నస్క ల్ చేరుకుని తుజాల్‌పూర్ నుంచి -నస్కల్ మద్యలో రూ.కోటి 40లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం నిజాంపేటకు చేరుకుని ఎస్‌సి, వంజరి, మున్నూరుకాపు, బుడగ జంగాల కమ్యూనిటీ హాల్‌లకు శంకుస్థాపన చేశారు. అనతరం జడ్‌చెర్వు తండా బీటీ రోడ్డుకు రూ.కోటి 40లక్షల మంజూరి కాగా అట్టి పనులను ఆమె ప్రారంభించారు. అనం తరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్ర భుత్వంలో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతు న్నాయని తెలిపారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నందున, రైతులు దీంతో ఇబ్బంది ఉంటే ముం దే అధికారులకు తెలిపితే అట్టి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సర ఫరా వేళలు తగ్గిస్తారన్నారు. ఈబిసిలకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని, అలాగే బీడి ప్యాకర్లకు పింఛన్లు అందించే యోచ నలో ఉన్నట్లు తెలిపారు. మే నుంచి రైతులు ఎకరానికి 4వేల పెట్టుబడిని అందించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమం లో ఎంపిపి పుట్టి విజయలక్ష్మి, జడ్‌పిటిసి బిజ్జ విజయలక్ష్మి, ఎంపిటిసిల ఫోరం మండలాధ్యక్షుడు పున్న వెంకటస్వామి, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్టి యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ బాజ చంద్రంతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.