Home ఆదిలాబాద్ అడవిని నరికేశారు

అడవిని నరికేశారు

Podu Agriculture

 

పోడు వ్యవసాయం పేరిట అడవి నరికివేత
నేలకొరిగిన వందలాది విలువైన చెట్లు
అడవులను నరికితే కఠిన చర్యలు డిఎస్పీ డేవిడ్

సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట గ్రా మ సమీపంలో దట్టమై అడవిని నరికివేశారు. అధికారుల నిర్లక్ష ం, అసమర్తత వల్ల దాదాపు ఐదు ఎకరాలలో అడవి నరికివేతకు గురైంది. పోడు వ్యవసాయం పేరిట పచ్చని, విలువైన వందలా ది నరికివేతకు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు నరికిన ఈ చెట్లవల్ల అటవీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. కవ్వాల్ టైగర్ జోన్ అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చే ఈ అటవీ ప్రాంత ంపై, ప్రతి నిత్యం అడవులను రక్షించడానికి అటవీశాఖ విస్తృత తనిఖీలు, గట్టి నిఘా నిర్వహిస్తున్నప్పటికి దాదాపు గత 10 రోజుల నుంచి ఈ అడవి నరికి వేతకు గురికావడం రక్షించడానికి అటవీశాఖ జేస్తుంది. పెద్ద మొత్తంలో అడవి నరికివేత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం చర్చనీయాంశంగా మారి ంది.

పోడు వ్యవసాయం పేరుతో ఈ అడవిని నరికి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిగిన ఈ అడవి నరికి వేతను అలస్యంగా తెలసుకున్న సిరిచెల్మ టైగర్ జోన్ రేంజ్ అధికారి వాహెబ్ అహ్మద్‌పై అధికారుల దృష్టికి తీసుకపోయారు. సిబ్బందిని అప్రమత్తం చేసి నరికివేత ప్రాంతానికి సిబ్బందిని పంపి చెట్ల నరికివేతను నిలిపియించారు. చెట్లను నరికివేసిన నిందితులు పారిపోయారు. దీంతో పెద్దెత్తున జరుగాల్సిన నష్టం నిలిచిపోయింది.

పోడు వ్యవసాయం పేరిట అడవిని నరికివేశారని సిరిచెల్మ టైగర్ జోన్ అటవీ సిబ్బంది, ఎఫ్‌ఆర్‌వో వాహెబ్ అహ్మద్ సంఘటనా స్థలానికి వెల్లడానికి పోలీసుల సహాయం కావాలని జిల్లా అధికారులతో విన్నవించగా ఈ మేరకు శనివారం గట్టి పోలీసు బందోబస్తు మద్య ఉట్నూర్ డిఎస్పీ డేవిడ్, ఇచ్డో సీఐ శ్రీనివాస్, సిరికొండ ఎస్సై ఫరీధ్, ఏఎస్సై ప్రకాష్, బోథ్ ఎఫ్‌ఆర్‌వో సత్యనారాయణఅ ఆధ్వర్యంలో బోథ్, సిరిచెల్మ రేంజిలకు చెందిన అటవీ, పోలీసు సిబ్బందితో కలిసి వాయిపేట గ్రామాన్ని సందర్శించారు. నరికివేతకు గురైన ప్రాంతానికి వెల్లి పరిశీలించారు. పెద్ద మొత్తంలో చెట్లు నరికివేతకు గురికావడం వల్ల వారుకూడా విచారణ వ్యక్తం చేశారు. అడవిని నరికివేస్తే కఠిన చర్యలు

ఉట్నూర్ డిఎస్పీ డేవిడ్ : పోడు వ్యవసాయం పేరుతో విలువైన అటవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ డిఎస్పీ డేవిడ్ హెచ్చరించారు. శనివారం వాయిపేట గ్రామ శివారు ప్రాంతంలో నరికివేతకు గురైన అటవీప్రాంతాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం వాయిపేట గ్రామంలో గ్రామస్తులను సమావేశ పరిచి మాట్లాడారు. టైగర్ జోన్ ప్రాంతంలో అడవిని నరికితే కఠిన శిక్షలు ఉన్నాయని కేసులు నమోదు అయితే నరకం అనవభవించాల్సి వస్తుందని అన్నారు. అడవులు అంతరించి పోవడంవల్ల సకాలంలో వర్షాలు కురియడం లేదని, దీని ప్రభావం జీవకోటిపై పడుతుందని, అడవులను రక్షించుకునే బాద్యత అందరిపై ఉందని అన్నారు.

వాయిపేట సమీపంలో పోడు వ్యవసాయం పేరిట పెద్దెత్తున అడవిని నరికివేయడం విచారకరమన్నారు. అడవి పచ్చగాఉంటే మనుషులతో పాటు, అడవిలో జీవించే జంతువులు కూడా సంతోషంగా జీవించ వచ్చన్నారు. అడవులు అంతరించి పోతే మానవాలిపై జీవులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను ఏ మాత్రం ఉల్లంగించవద్దని సూచించారు. అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాలను, వాటిని రక్షించడం వల్ల కలిగే లాబాలను గ్రామస్తులకు సవివరంగా ఆయన వివరించారు. అనంతరం గోండిభాషలో అటవీపోలీసు సిబ్బందితో గిరిజనులకు అవగాహన కల్పించారు.

In the name of Podu Agriculture the Forest is cut down