Tuesday, March 21, 2023

వచ్చే ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో గులాబీదే గెలుపు

- Advertisement -

trs2

*మంత్రి ఈటెల రాజేందర్

మన తెలంగాణ/దుగ్గొండి: నర్సంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు సిద్ధపడాలని మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చా రు. గురువారం మండలంలోని కేశవపురం, లక్ష్మీపురం, బం దంపల్లి, పొనకల్ గ్రామాలలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఈటెల, గొర్రెల మేకల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్‌లకు బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుల్లు, కోలాటాలతో ఘనస్వాగ తం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈటెల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రసాధనలో ముందునడిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాష్ట్ర ఏర్పాటులో గెలిపించుకోకపోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దికి అండగా ఉన్నారని తాను కూడా తోడ్పాటునందిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని దీనికి కారణం గెలిచిన ఎంఎల్‌ఎ కాంట్రాక్టర్  కావడంతో పనులు జరగక ప్రభుత్వానికి చెడు పేరు తెస్తున్నారని విమర్శించారు. పదవిలో లేకున్నా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని పెద్ది లాంటి ఉద్యమకారుడు లేరని అన్నారు. నియోజకవర్గంలో ఎస్సారెస్పి కాలువలు తవ్విన నాటి నుంచి నేటి వరకు తుమ్మలు మొలిచి నీరు రాక రైతులు ఇబ్బంది పడ్డారని 57సంవత్సరాల్లో 40సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం , 17 సంవత్సరాలు పాలించిన ఇతర ప్రభుత్వాలు చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మూడు సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనన్నారు. రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సంకల్పంతో 17వేల కోట్ల రూపాయలతో రుణమాఫి, 24 గంటల విద్యుత్, పెట్టుబడి రాయితీతో పాటు రాబోయే వర్షాకాలంలో ఎస్సారెస్పి ద్వారా రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందచేయనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదిముబారక్, గొల్లకురుమల అభివృద్ధి కోసం గొర్ల పంపిణీ, ముదిరాజ్ కుటుంబాలకు చేపపిల్లల పంపిణీ తో పాటు 80శాతం రాయితీతో పాటు యంత్రాలను అందించనున్నట్లు తెలిపారు. మొక్కజొన్న, పసుపు, కందులు , వేరుశనగ లాంటి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయసమితిల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటామన్నారు . నర్సంపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నియోజకవర్గ ప్రజలు పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
రాజయ్యయాదవ్ మాట్లాడుతూ……
గొల్లకురుమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని గ్రామంలో ఉన్న ప్రతీ ఒక్కరికి పార్టిలకతీతంగా గొర్రెలను అందిస్తామని, గొర్రెల లబ్ధిదారులు వాటిని అమ్ముకోకుండా కాపాడుకోవాలని మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో రాష్ట్రంలో ముందుండేలా గొల్లకురుమలు పాటుపడాలన్నారు. సబ్సిడి గొర్రెలను అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదని అన్నారు. ఉద్యమకారుడు పెద్దికి ప్రజల మద్ధతు తెలపాలని సూచించారు.
పెద్ది మాట్లాడుతూ………
నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సహాకారంతో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని , గ్రామాల సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి నిదుల మంజూరును చేస్తున్నట్లు తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణం, మహిళా బిల్డింగ్‌లు, కమ్యునిటీ హాల్‌లు లాంటి ప్రాధాన్యత గల వాటికి నిదులు ఎస్‌డిఎఫ్ నిదులు అందిస్తానని తెలిపారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, గ్రామ సర్పంచ్ బొమ్మగాని సుమలత రవికుమార్, ఎంపిపి కుక్కమూడి సుశీల కమలాకర్, జెడ్పిటిసి సుకినెరజిత రాజేశ్వర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్, నాయకులు పొన్నం మొగిలి, రేవూరి సురేందర్‌రెడ్డి, గుండెకారి రంగారావు, తోకల నర్సింహరెడ్డి, దార్ల రమాదేవి, గుంటి కిషన్, సాంబలక్ష్మి, కేశవపురం సర్పంచ్ వైనాల మురళితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి ఈటెల రాక సందర్భంగా నర్సంపేట ఏసిపి సునితామోహన్ ఆధ్వర్యంలో సిఐ బోనాల కిషన్ బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో దుగ్గొండి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, నల్లబెల్లి ఎస్‌ఐ హరికృష్ణ, అభినవ్, లతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News