Saturday, April 20, 2024

రాహుల్ @ 2

- Advertisement -
- Advertisement -

టి20 ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ విభాగంలో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాహుల్ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో అతనికి రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక, ఐసిసి సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో కూడా రాహుల్ (823) పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం తన ర్యాంక్‌ను పదికి చేజార్చుకున్నాడు. కొంతకాలంగా టి20 ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో ఆడడంలో కోహ్లి విఫలమవుతున్నాడు. దీంతో అతనికి కిందికి పడిపోతూ వస్తోంది. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి పదో ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ పదకొండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

వీరు ముగ్గురు తప్పిస్తే మరే భారత క్రికెటర్ కూడా టి20 ర్యాంకింగ్స్‌లో టాప్20లో చోటు సంపాదించలేక పోయారు. పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ 879 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మన్రో నాలుగో, ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ 749 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గాన్‌కే చెందిన ముజీబుర్ రహ్మాన్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

కివీస్ స్పిన్నర్ మిఛెల్ సాంట్నర్ మూడో, ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పాకిస్థాన్ బౌలర్ ఇమాద్ ఐదో ర్యాంక్‌ను సాధించాడు. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా 12వ ర్యాంక్‌లో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కంటే పాకిస్థాన్ కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో మాత్రమే ఉంది. 265 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో, 264 పాయింట్లతో భారత్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లు ఐదో, ఆరో ర్యాంక్‌లను దక్కించుకున్నాయి.

In the T20 rankings Lokesh Rahul is ranked second
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News