Thursday, April 25, 2024

విద్యార్థులు నైపుణ్యాలకు పదును పెట్టండి: గవర్నర్

- Advertisement -
- Advertisement -

Inaugurated job fair in JNTU Hyderabad

హైదరాబాద్ : విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం జెఎన్‌టియూలో మెగాజాబ్ మేళాను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచనలు వినూత్నంగా ఉండలన్నారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఉపాధి కల్పన, వ్యవస్థాపక నైపుణ్యాలను మెరుగుపర్చడానికి దోహదం చేస్తున్నాయన్నారు. మన దేశం నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రపంచ సరఫరాదారుగా పనిచేస్తుందన్నారు. విద్యార్థులు తమ అభ్యసన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో పట్టుదల కృషి చేయలన్నారు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలతో ఇంటర్‌ఫేస్, ఇంటర్న్‌షిప్ అనుభవాన్ని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జెఎన్‌టియూ, సేవా ఇంటర్నేషనల్, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ వంటి సంస్థలు మెగా జాబ్ మేళా నిర్వహించడాన్ని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News