Thursday, April 25, 2024

గిరిజన, ఆదివాసీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Inauguration ceremony of Adivasi and Banjara buildings on 17th

త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కారం
17 సిఎం చేతుల మీదుగా ఆదివాసి, బంజారా భవనాల ప్రారంభోత్సవం
ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదివారసీ, గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన ఆదివాసీల అభివృద్ధే ప్రభుత్వ లక్షమన్నారు. ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభించుకోబోతున్న నేపథ్యంలో మంత్రి సభా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన బంజారా, ఆదివాసి సంఘాల నాయకులు, ట్రైకార్, జిసిసి చైర్మన్‌లు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై సమీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సభ ఏర్పాట్లపై చర్చించారు. 17వ తేదీన పీపుల్స్ ప్లాజా నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్‌టిఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన బంజారా, ఆదివాసి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగిందని అన్నారు. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరించుకోబోతున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ సమాజం తలెత్తుకొని బతికేలా ముఖ్యమంత్రి పాలిస్తున్నారని అన్నారు. గురుకుల విద్య, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పెన్షన్లు వంటి అనేక పథకాలను కెసిఆర్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారన్నారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రంతో పోరాడి తప్పకుండా సాధిస్తామన్నారు.

సమావేశంలో నాయకులు మాట్లాడిన అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార దిశగా కృషి కృషి చేస్తామని మంత్రి హామినిచ్చారు. గిరిజన సంక్షేమాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను మరింత పటిష్ఠం చేస్తూ రాబోయే రోజుల్లో గిరిజన జాతిని సమాజంలో అందరితో సమానంగా బతికే విధంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ వాల్యానాయక్, ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్, టిఆర్‌ఎస్ ఎస్‌టి సెల్ అధ్యక్షుడు రూప్ సింగ్ నాయక్, మాజీ ఐపిఎస్ డిటి నాయక్, మాజీ డిఐజి జగన్నాథరావు, ఐఎఎస్ భారతి లఘుపతి నాయక్, ఆర్‌టిసి మాజీ కమిషనర్ పాండురంగ నాయక్, గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు హనుమంతు నాయక్, తెగ అధ్యక్షులు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News