Tuesday, March 21, 2023

ఎస్‌సిల్లో చేర్చాలి

- Advertisement -

scs

చాకలి పోరుగర్జనలో వక్తల డిమాండ్ 

మన తెలంగాణ/ ఎల్‌బి నగర్ : అనాదిగా చాకలి కులస్తులు పేదరికం, అవమానంతో జీవనం సాగిస్తున్నారని, రజకుల మనోభావాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గౌరవించి వారిని బిసి ‘ఎ’ నుంచి ఎస్‌సి జాబితాలో చేర్చాలని బీహార్ విద్యుత్ శాఖ మాజీమంత్రి, ప్రస్తుత శాసన సభ్యులు శ్యాం రజక అన్నారు. చారిత్రక చాకలి మహాపాదయాత్ర అనంతరం ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పా టు చేసిన ‘చాకలి పోరుగర్జన’ బహిరంగ సభకు శ్యాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు విద్య, ఉపా ధి, రాజకీయ రంగాల్లో రాణించాలన్నారు. ఇది సాధ్యం కావాలంటే రజకులు కలిసికట్టుగా, ఐక్యం గా ఉండాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న రజకులకు విద్య, ఉద్యోగాలు, చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ శాసన సభ్యులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రజకులు ఆర్థికంగా, మానసికంగా బాధపడుతున్నారని, వివాహం చేసుకోవాలన్నా, జన్మించినా, చివరికి చనిపోయిన చాకలి వారు లేనిది ఏ పని జరగదన్నారు. చాకలి వారు చేస్తు న్న వృత్తి సామాజిక సేవనేనన్నారు. హక్కుల సా ధన కోసం రజకులు రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో రజక భవనం నిర్మాణానికి కృషి చేస్తానని, 100 శాతం రాయితీపై వాషింగ్ మిషన్లు ఇప్పిస్తామని చెప్పారు. అదే విధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పా రు. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ శ్రీలక్ష్మీని వారం రోజుల్లో సిఎం కేసిఆర్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యలపై చర్చలు జరుపుతామని చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్ వాషింగ్ మిషన్లు, రజక భవనం నిర్మాణం చేస్తామని తన ప్రసంగంలో అ నగానే అవి మాకు వద్దు, ఏదైనా మాట్లాడితే రజకులను ఎస్సీల్లో చేర్చే విధంగా ఏమి చర్యలు తీసుకుంటారని చెప్పాలని సభ నుంచి యువత కేకలు వేశారు. దాంతో ఆయన మీ సమస్యలన్ని సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.
దోభీఘాట్స్, ఇస్త్రీ పెట్టెలు వద్దే వద్దు
రజకులకు ప్రభుత్వం ఇస్తామంటున్న ఇస్త్రీ పెట్టెలు, దోభీఘాట్స్, వాషింగ్ మిషన్లు తమకు వద్దే వద్దని, అట్టడుగులో ఉండి దుర్భరజీవనం సాగిస్తున్న రజకులను వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మాణం చేయాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మీడిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న రజకులకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో అన్యాయం అవుతుందని చెప్పారు. జనాభా ప్రకారం తమకు రావాల్సిన వాటా రావాలన్నారు. రజక కులస్తులు ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులను గెలిపించే సత్తాలేకున్నా, ఓడించే సత్తామాత్రం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు రజకులను గుర్తించి టికెట్లు ఇవ్వాలన్నారు. రజకుల సమస్యలు తీర్చి, రజకుల అభివృద్ధికి బిసి ఎ నుంచి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తిర్మాణం చేయాలని సిఎం కేసిఆర్‌కు లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ప్రతి రజక కుటుంబానికి బ్యాంకులకు లింకులు లేకుండా రూ. 5లక్షలు రుణాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఎలిజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగన సభలో వి.చంద్రశేఖర్, (కర్ణాటక), అమిత్ ఖత్రీ(హర్యానా), రాఘవేంద్ర (మహారాష్ట్ర), రజక సంఘం నేతలు భీమరవపు సుబ్బారావు, ముదిగొండ వెంకట సుబ్బయ్య, రాయల శ్రీనివాస్, జి.రామకృష్ణ, ఫ్రొ.అక్కినపల్లి పున్నయ్య, ఫ్రొ. బి.వి.రాఘవులు, ఫొ.ఇ.దత్తత్రేయలతో పాటుగా రజక యువ నేతలు, ఓయు జేఏసి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles