Home తాజా వార్తలు రేవంత్ కంపెనీలు

రేవంత్ కంపెనీలు

Income Tax raids on Congress Leader Revanth Reddy

హైదరాబాద్: రేవంత్ రెడ్డి … అనతికాలంలోనే అత్యంత వేగంగా రాజకీయాల్లో ఉన్నత పదవులకు ఎలా చేరు కున్నారో ఇప్పుడు అవినీతి కేసులు, అక్రమ సంపాదన, ఆదాయానికి మించిన ఆస్తులు… ఇలా రకరకాల ఆర్థిక లావాదేవీల్లో అంతకంటే వేగంగా వివాదాల సుడి గుండంలో చిక్కుకున్నాడు. నిన్నటిదాకా ‘ఓటుకు నోటు’ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి యావత్తు తెలుగు సమాజానికి తెలిసింది. ఇటీవల జూబ్లిహిల్స్ భూవివాదంలోనూ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తాజాగా న్యాయవాది రామారావు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్నుశాఖ అధికారులు సంయుక్తగా ఏకకాలంలో పదిహేను చోట్ల సోదాలు నిర్వహించి రేవంత్ రెడ్డి వ్యాపార  సామ్రాజ్యపు అక్రమాల పుట్టలను తవ్వితీస్తున్నారు. ఒక్కొక్కటిగా దిగ్భ్రమ చెందే సంచలన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది రామా రావు ఫిర్యాదు వివరాల్లో దేశ విదేశాల్లోని సంస్థల్లో రేవంత్‌రెడ్డి తన బినామీ పేర్లతో వేల కోట్ల రూపాయలను ఎలా కుమ్మరించారో, వివిధ అక్రమ మార్గాల్లో ఏ విధంగా సమీకరించారో, ఆక్రమంగా తన బంధువులనే బినామీలుగా పెట్టుకుని హవారా మార్గాల్లో పోగేసుకున్నారో ఉదాహరణలతో సహా వెల్లడించారు. ఇప్పుడు ఈ సంస్థలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆ సంస్థల వార్షిక ఆడిట్ నివేదికలపై అధికారులు దృష్టి సారించారు. ఆ ఫిర్యాదులో రామారావు పేర్కొన్న కంపెనీల రిజిస్ట్రేషన్ వివరాలు ఇలా ఉన్నాయి…

రేవంత్‌రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఇవే:-
శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్
బంజారాహిల్స్‌లో 2003లో రిజిస్ట్రేషన్

బిల్డర్స్ ప్రైడ్ ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పి
హైదరాబాద్‌లో 2017లో రిజస్ట్రేషన్

శ్రీ సాయి మౌర్య ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2003లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

విజయ మగథ ప్రాజెక్టు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2007లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

అవలాంచెస్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2008లో రిజిస్ట్రేషన్

శ్రీ సాయి మగధ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2006లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

దుర్గా పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 1994లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

స్టూడియో సెవెన్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2007లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

ఫ్రూషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2005లో రిజిస్ట్రేషన్

ఆర్‌పాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2007లో రిజిస్ట్రేషన్

వార్‌టెక్స్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2007లో రిజిస్ట్రేషన్

ఎస్‌విఆర్ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2008లో రిజిస్ట్రేషన్

కీ సాఫ్ట్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2015లో రిజిస్ట్రేషన్

స్టడీ ఫీవర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2011లో రిజిస్ట్రేషన్

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పాలిమర్స్ బిటుమెన్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2011లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

సాయి రోజా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2002లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

విఎస్‌ఆర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2011లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)

విజయ ఏరో బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2012లో రిజిస్ట్రేషన్

లార్స్ ఫెర్రో అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్‌లో 2011లో రిజిస్ట్రేషన్ (మూతపడింది)