Home తాజా వార్తలు భేషైన ఇసుక పాలసీ

భేషైన ఇసుక పాలసీ

Sand

మన తెలంగాణ/హైదరాబాద్: ఇసుక ద్వారా ఆదాయం రాబట్టడం తో పాటు ఇసుక పాలసీలో దేశంలో నే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఐఎస్‌ఓ 9001, 2015 సంస్థగా గు ర్తింపు పొందిందని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ (టిఎస్‌ఎండిసి) శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టిఎస్‌ఎండిసి ఎండి మ ల్సూరు, ఆ సంస్థ ఉద్యోగులు ఆయనకు మంగళవారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒక సంస్థగా ఎస్‌ఎండిసి ఎదిగిందన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన అవకాశంతో ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. కెటిఆర్, కెసిఆర్ సహకారంతో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా టిఎస్‌ఎండిసిని నిలుపుతానని హామినిచ్చారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు టిఎస్‌ఎండిసి ద్వారా ప్రభుత్వానికి కేవలం రూ.39.69 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. మూడేళ్లలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఘనకీర్తిని సొంతం చేసుకుందన్నారు.
797 హెక్టార్లలో లైమ్‌స్టోన్ గనులను ఓరియంట్ సంస్థకు లీజుకిచ్చాం
2007 నుంచి 2008 వరకు, 2008 నుంచి 2013 వరకు, 2013 నుంచి 2014 వరకు రూ.39.69 కోట్ల ఆదాయాన్ని మాత్రమే ఈ సంస్థ ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. 2014 తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి 2015, 2015 నుంచి 2016 వరకు రూ.535.43 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. 2016 నుంచి జూలై 10, 2019 వరకు రూ.2207.78 కోట్ల ఆదాయం తమ సంస్థకు వచ్చిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఖనిజాలను కొల్లగొట్టారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాతా రెట్టింపు ఆదాయంలో ముందుకు వెళుతున్నా మన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 80కి పైగా ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో 4 కోట్ల 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేశామన్నారు. ఇసుక సరఫరాతో ఇప్పటివరకు 2753.09 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో 797 హెక్టార్లలో లైమ్‌స్టోన్ గనులు ఓరియంట్ సంస్థకు లీజుకిచ్చామన్నారు. రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ వలన 4 వేల కుటుంబాలకు ఉపాధితో పాటు పరోక్షంగా 20 వేల మందికి జీవోనపాధి దొరుకుతుందన్నారు. ఈ లీజు మూలంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు ఏడాదికి రూ. 8.4 కోట్ల ఆదాయం అందనుందన్నారు.
తెలంగాణలో ఆరు క్వారీలను లీజుకు తీసుకున్నాం
తెలంగాణలో ఆరు క్వారీలను తమ సంస్థ లీజుకు తీసుకుందన్నారు. అందు లో ఖమ్మం జిల్లా వెంకటాపూర్ క్వారీ నుంచి ఏడాదికి రూ.43 లక్షల ఆదా యం వస్తుందన్నారు. అభివృద్ధి దశలో ఉన్న మిగిలిన ఐదు క్వారీలకు త్వరలోనే ఆదాయం వస్తుందన్నారు. టిఎస్‌ఎండిసిని జాతీయ ఖనిజాన్వేషన్ ఏజెన్సీగా కేంద్ర ఖనిజ మంత్రిత్వ శాఖ గుర్తించిందన్నారు. ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఖనిజాన్వేషణ చేసేందుకు టిఎస్‌ఎండిసికి బాధ్యతలను అప్పగించిందన్నారు. టిఎస్‌ఎండిసి జాతీయ ఖనిజాన్వేషణ సంస్థగా గుర్తించిన తరువాత సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండలో సున్నపురాయి నిల్వల వెలికితీతకు రూ.29 కోట్లు జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ కేటాయించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఖనిజాన్వేషణకు అవకాశం ఇవ్వడం తమ సంస్థ పనితీరుకు నిదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థను దేశంలోని ఇతర రాష్ట్రాల ఖనిజాభివృద్ధి సంస్థలకు ఆదర్శ ప్రాయంగా నిలుపుతానని పేర్కొన్నారు.

Income With Sand Policy in Telangana