Home మహబూబ్‌నగర్ ముందస్తుకు నై ఆదిపత్యానికి సై

ముందస్తుకు నై ఆదిపత్యానికి సై

Incomplete headaches in the constituencies

కాంగ్రెస్‌లో వింత పోకడ
నియోజకవర్గాల్లో ఇంచార్జీలకు తప్పని తలనొప్పులు
ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు
కోర్టు కేసులతో రాద్ధాంతం
ప్రతి నియోజకవర్గంలో ఆదిపత్య పోరు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ :  ఉమ్మ డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్యం కోసం కొనసాగుతున్న పోరు ఏకంగా హస్తినకు చేరింది. సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి డికె అరుణల మధ్య కొనసాగుతున్న వర్గ పోరు చిలికి చిలికి గాలి వానలా మారి ఢిల్లీ అధిష్టానం వద్దకు వెళ్లడంతో ఉమ్మడి జిల్లా కాం గ్రెస్ నాయకులు విస్మయానికి గురౌతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలతో గ్రామ స్థాయిలోకి దూసుకెళ్తున్న అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై నాయకులు సమిష్టి కృషి మరిచినట్లైంది. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న ఎన్నికలు వస్తున్నాయన్న ప్రచారం జోరందుకోవడంతో అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీలోనే హడావిడి మొదలైంది. అయితే ముందస్తు ఎన్నికలలో పోటీ చేసే విషయంపై పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఆదిపత్య పోరుకే ప్రాధాన్యత ఇస్తూ సై అంటున్నారు. దీని ద్వారా జిల్లాలో పట్టునిలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. క్రాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఆశవాహులు ఉన్నప్పటికి, ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో కనీసం అరడజను మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెరపైకి వచ్చారు. ఇందులో కూడా సీనియర్లు, జూనియర్లను వెంటేసుకొని ఎవరి ప్రయత్నాలు వారు ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భలమైన నాయకులుగా పేరు న్న జైపాల్‌రెడ్డి, డికె అరుణ, డాక్టర్ చిన్నారెడ్డి, డాక్టర్ మల్లురవితో పాటు ఇటీవల పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి, డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డిలు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ను ఏకతాటిపైకి తీసుకురాలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.తమ తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించడం తప్ప ఇతర నియోజకవర్గాలలో శ్రద్ద చూపకం పోవడం కారణంగా సీనియర్లు అసంతృప్తికి లోనవుతున్నారు. స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రాభల్యాన్ని ఏ విధంగా తట్టుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి విస్తృ త పర్యటనలతో ఎమ్మెల్యేలు బలపడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఆదిపత్య పోరులోనే మునిగితేలుతున్నారు. రైతు బంధు, రుణమాఫీ, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, బిసిలకు వంద శాతం రుణం, కెసిఆర్ కిట్లు, వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రస్తుతానికి ప్రభుత్వ పనితీరుపై జిల్లా వ్యాప్తంగా హర్సాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పరిస్థితి కనిపించక పోవడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులనే అస్త్రాలుగా చేసుకొని రాజకీయ రాద్దాంతం చేస్తుండడం కనిపిస్తోంది. అందు లో బాగంగానే ఇటీవల మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నాటకీయ ఫక్కీలో ఇద్దరు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసులు పెట్టడం చర్చకు దారి తీసింది. వాస్తవానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెం పాడు,కోయల్ సాగర్, భీమా, ఎత్తిపోతల పథకాల ద్వార రైతాంగానికి సాగునీరు అందుతోంది. ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెష్టోలో పెట్టనప్పటికీనిక ఈ జిల్లా ప్రజలకు మేలు చేకూర్చాలన్న ఆకాంక్షతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇటు మహబూబ్‌నగర్ జిల్లా అటు రంగారెడ్డి, మరో పక్క నల్లగొండ జిల్లాలకు దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నాల్లో మంత్రు లు సఫలీకృతం అవుతున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతండడంతో కోర్టులలో కాంగ్రెస్ నాయకులు కేసులు వేయ డం కారణంగా పనులకు అడ్డంకులు ఎదురౌతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యలో కెసిఆర్ ఆదేశాల మేరకు తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పాలమూరు రంగారెడ్డి పథకం పను లు కూడా బ్రేక్ లేకుండా జరిగేలా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పలుమార్లు జిల్లాలో పర్యటించి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పడు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా ప్రాజెక్టులు మా హాయంలోనే జరిగాయంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. సొంత పార్టీలో పరిస్థితిని చక్కదిద్దుకోలేని ఆ పార్టీ నాయకులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకునేందుకు చూస్తుండం గమనించదగ్గ విషయం. వర్గపోరు విషయంలో పైకి గాంభీర్యత ప్రదర్శించినా ఎన్నికల రాక ముందే కాంగ్రెస్ నాయకుల లొల్లి ఢిల్లికి చేరిందంటే ఆ పార్టీ పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యేల ద్వారా గ్రామాల్లో పర్యటించి ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గాల్లో ఇంచార్జీలకు తప్పని తలనొప్పి
ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల పార్టీ నాయకులు మద్య పోటీ ఉండడం,మరి కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇంచార్జీలు లేక పోవడంతో ఎవరికి వారే ఎమునాతీరుగా కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి మారింది.మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షుడి ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్న వారు ఆరడజను వరకు ఉన్నారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్,సంజీవ్ ముదిరాజ్,ఎన్‌పి వెంకటేష్,ఎం సురేందర్‌రెడ్డి,సయ్యద్ ఇబ్రహీం,ముత్యాల ప్రకాష్ తదితరులు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే పోటీ చేసేందుక ఉవ్విళ్లు ఊరుతున్నారు.ఇదిలా ఉండగా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా ఎన్నికల పొత్తులో కాని, లేదా, కాంగ్రెస్ నుంచైనా ఈ సారి మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా షరాఫ్ కృష్ణ కొనసాగుతున్నారు. ఈయనతో పాటు ఆ నియోజకవర్గంలో డిసిసిబి చైర్మన్ వీరారెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ మాజి చైర్మన్ రెడ్డిగారి రవీంద్ర రెడ్డిలు ఉన్నారు. పేటలో మాస్ నేతగా పేరున్న టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కె. శివకుమార్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరగగా స్థానిక నాయకులు ఆదిలోనే అడ్డుకున్నారు. మఖ్తల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రస్తుతం టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇంచార్జి లేక పోయినప్పటికీని సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. శ్రీనివాస్‌గుప్త, అక్కల సత్యనారయణ, చిట్యాల నిజాం పాష, శ్రీహరి, తదితరులు ఎమ్మెల్యే పదవిని ఆశిస్తు పార్టీ నేతలు చుట్టూ తిరుతున్నారు.కొల్లాపూర్‌లో నియోజకవర్గం ఇంచార్జిగా బీరం హర్ష వర్దన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలోనే జగదశ్వర్‌రావు కూడా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవకద్ర నియోజకవర్గంలో డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున టికెట్ కోసం మాజీ జడ్‌పిటిసి ప్రదీప్‌గౌడ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డోకూర్, ప్రదీప్‌లతో పాటు నియోజకవర్గంకు చెందిన హైకోర్టు న్యాయవాది జి మధుసూధన్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.