Home తాజా వార్తలు వామ్మో ధరలు

వామ్మో ధరలు

wrl-123మరిపెడ : పెరిగిన నిత్యవసర సరుకు ల ధరలు పేద,మధ్య తరగతి వారిని వామ్మో అనిపిస్తున్నాయి.మాంసం ధరలు అకాశాన్ని అంటుకుని పేదవాడికి ఎపుడో దూరం కాగ ఉల్లి,పుపు దినసలు ధరలు సైతం పెరిగి సామన్యున్ని వెక్కిరిస్తు న్నాయి. వంద రోజుల్లో మార్పు తీసుకువస్తమన్న కేంద్ర ప్రభు త్వం… ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పాడిన స్వరాష్ట్రంలోనూ పెరుగు తున్న నిత్యవసర సరుకుల ధరలు పల్లెవా సులు పౌష్టిక ఆహరాన్ని దూరం చేస్తున్నా యి.అత్యధిక గిరిజన ప్రాబల్యం కలిగిన డోర్నకల్ నియోజకర్గంలో నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం మూలంగా తండా వాసులు పౌష్టిక ఆహా రానికి నోచుకోవటం లేదు.తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర తమకు అందని కొనబోతే పెరిగిన ధరలు ఇలా ఉన్నాయేమిటని తండాలకు చెందిన గిరిజన రైతలు ముక్కున వేలేసు కుంటున్నా రు.ప్రపంచీకరణ ప్రభావం,పెట్టుబడి దారి వర్గం దోపిడిని గ్రహించలేని పల్లె పేదలు కనిపించని కుట్రలో నలిగిపోతున్నా రు.ఆహర ధాన్యల ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో పట్టించు కోవాల్సిన పాలకులు ఆర్భాటపు ప్రకటనలు మినహ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కరానికి నోచుకోవటం లేదు.చివరకు పాలకుల పనితీరుపై విసిగి వేసరిన ప్రజలు ఆర్థిక భారం అయినప్పటికి మంచినీరు సైతం నెలకు రూ.300 వెచ్చించి కోనుగోలు చేస్తున్నారంటే పల్లెవాసులు ఆహర పదార్థల కోసం వ్యయం చేస్తున్న తీరు స్పష్టమవుతుంది.కరువును తలపిస్తున్న క్రమంలో వ్యవసాయ కూలీలకు పనులు సైతం దొరకటం లేదు.ఈ క్రమంలో పెరిగిన ఉల్లి ధరలు,పప్పు ధాన్యల ధరలు వెక్కిరిస్తున్నాయి.ఉల్లి,పప్పుతో పాటు నాణ్యమైన సన్న రకాలకు చెందిన బియ్యం ధరలు,వంట నూనెలు సైతం సామన్యులకు అందుబాటులోకి లేకపోవటం మూలన గ్రామీణ వాసులు ఆవస్థలు పడుతున్నారు.
ఆక్రమంగా తరలుతున్న ‘సన్నబియ్యం’
జిల్లా సరిహద్దులో ఉన్న మరిపెడ మండల నల్డొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ముఖ్య కూడలిలో ఉంది. అత్యధిక సాగు కలిగిన మరిపెడ మండలంలో స్థానిక రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసిన వ్యాపారులు సన్నబియ్యాన్ని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఆక్రమంగా తరలిస్తూ సోమ్ము చేసుకుంటు న్నారు. ప్రభుత్వ నిబంధనాలకు విరుద్ధంగా పలు చోట్ల బియ్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆక్రమంగా దోచే సుకుంటున్న ప్రభుత్వంతో పాటు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్,పౌర సరఫరాలతో పాటు తదితర శాఖలకు చెందిన అధికారులు నిర్లక్షం, తెరచాటు వ్యవహరం మూలన సన్నబియ్యం ఆక్రమ రవాణ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.ప్రభుత్వం విజిలెన్స్ దాడులు నిర్వహించి చెక్‌పోస్టులు పకడ్భాందిగా నిర్వహించాలని ఓ వైపు కోరుతున్నప్పటికి అధికారులు కార్యచరణలో వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం ఆర్బాటపు ప్రకటనలు మానుకోవాలి : సిపిఐ
ఏన్నో ఆశాలతో కోలువైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామా న్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరంలో విఫలమ వుతు న్నాయి. అమలు కాని హమీలతో కాలం వెళ్లదీస్తు న్నాయని సిపిఐ డోర్నకల్ నియోజవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు.వివిధ శాఖల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయటం లేదన్నారు.ప్రభుత్వం ఇచ్ని హమీల్లో ప్రగతిలో ఉన్నవి శూన్యం అన్నారు.
ధరల నియంత్రణకు చట్టం చేయాలి;సిపిఎం
రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు ప్రభుత్వం కళ్లెం వేయాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరల మూలంగా సామాన్యులు నాణ్యమైన ఆహరం తీసుకోవటం లేదని దీంతో రోగల భారిన పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.పెరుగుతున్న ధరల నియంత్రణకు చట్టం తీసుకురావలని ఆయన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను