* భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేటలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. సిద్దిపేట పట్టణంలో భూగర్భ పనులను ప నులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో పనులు పూర్తయ్యాయని రెండో దశలో నిర్మిస్తున్న పనులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో ముస్తాబాద్ సర్కిల్ నుండి ఏరియా ఆసుపత్రి వరకు ప్రధాన రహదారిలో జరుగుతున్న యూజీడీ పైప్‌లైన్ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జెసి పద్మాకర్, మున్సిపల్ చైర్మన్, పురపాలక కమీషనర్ శ్రీనివాస్‌రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మా ట్లాడుతూ 230 కిలోమీటర్ల వరకు యూజీడీ పైప్‌లైన్ పనులకు ఇ ప్పటికే 50కి.మీల మేరా ప నులు పూర్తి చేశామని మి గిలిన 120కి.మీల పను లు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడో విడ త పనులు కూడా ప్రా రంభించి త్వరగా పూర్తి చే సేలా చర్యలు చేపట్టాలని అ ధికారులకు సూచించారు. పను ల్లో నాణ్యత పాటించాలని పబ్లిక్ హె ల్త్ శాఖ అధికారులను ఆదేశించారు. అ నంతరం బ్రిక్స్ స్టాక్ యార్ట్‌ను సందర్శించిన మంత్రి మ్యాన్ హోల్‌ల నిర్మాణం, బ్రిక్స్ తయారీ, నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నార్సపూ ర్ ప్రాంతంలో శివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు కావాల్సిన భూ సేకరణ త్వరగా పూచేసి అప్పగిపంచాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఎర్రచెరువు నుండి చింతల్ చెరువు వెళ్లే మార్గం యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనే జీ కోసం ఉన్న అడ్డంకులను తొలగించాలని తహసీల్ధార్ పరమేశ్వర్, చైర్మన్ రాజనర్సులకు సూచించారు. అత్యధిను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బిడబ్లూసి విధానంతో చేపడుతున్న పనుల విధానం తీరు తె న్నులపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.