Thursday, April 25, 2024

పెరిగిన బంగారం రుణాలు

- Advertisement -
- Advertisement -

increased gold loans in india

పసిడి రుణ విభాగంలో 33.8 శాతం పెరుగుదల
తక్షణ అవసరాల కోసం పసిడి రుణాలను ఆశ్రయిస్తున్న ప్రజలు

న్యూఢిల్లీ: గత 15 నెలల్లో కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయ్యాయి. ప్రత్యేకించి మధ్య, దిగువ ఆదాయ వర్గాల్లో సంపాదన తగ్గింది. నిరుద్యోగం పెరగ్గా, ఆర్థిక పరిస్థితి క్షీణించింది. మరోవైపు వై ద్య పరమైన వ్యయాలు అనూహ్యంగా పెరగడం తో ప్రజలు బంగారం రుణాల వైపు మొగ్గు చూ పుతున్నారు. 2021 మే ముగింపు వరకు గత 12 నెలల కాలంలో వాణిజ్య బ్యాంకుల్లో బంగారం రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

అన్ని రం గాల్లో బంగారం రుణాలు 33.8 శాతం మేరుకు పెరిగాయి. అదే సమయంలో చాలా వరకు ప్రజ లు తమ తక్షణ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఆర్‌బిఐ (భారతీయ రిజ ర్వు బ్యాంక్) డేటా ప్రకారం, 2021 మేలో బం గారం విభాగంలో రుణం 33.8 శాతం పెరిగిం ది. గత 12 నెలల్లో ఇతర విభాగాల కన్నా ఇది ఎక్కువగా ఉండడం గమనార్హం. గత 12 నెలల్లో బంగారం రుణాలు 2020 మేలో రూ.46,415 కోట్ల నుంచి ఇప్పటివరకు రూ.62,101 కోట్లకు చేరుకున్నాయి. 2021 మార్చి 31నాటికి బంగా రు రుణం తీసుకునే రుణగ్రహీతల సంఖ్య 25.9 లక్షలకు చేరింది. వ్యక్తిగత రుణ విభాగంలో ఆటో లోన్, క్రెడిట్ కార్డు బకాయిల పెరుగుదల కూడా ఉంది. ఈ ఏడాది మేలో ఇది 12.4 శాతం పెరి గింది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బంగారం రుణ వ్యాపారం 46.5 శాతం పెరిగి రూ. 20,987 కోట్లకు చేరుకుంది. ఎందుకంటే తక్కు వ ఆదాయ వర్గాలు, మైక్రో యూనిట్లు, గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఆర్థిక పరిమితుల కారణంగా బంగారు రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. ఎస్‌బిఐ గోల్డ్ లోన్‌కు 7.50 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News