Home సూర్యాపేట పేటలో పెరిగిపోతున్న భూ స్వా(హా)ములు

పేటలో పెరిగిపోతున్న భూ స్వా(హా)ములు

 land

* నకిలీ పత్రాలను సృష్టించి సొమ్ము చేసుకుంటున్న వైనం
* రియాల్టర్ల అక్రమ దందా – అమాయకుల ఆస్తులే వారి లక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడిన నాటి నుండి రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అక్రమ దంధౠను జోరుగా, షారుగా కొనసాగి స్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అమాయక ప్రజలే వారి లక్షంగా ఎంచుకొని సంబంధంలేని భూములను సైతం నకిలీ ధృవ పత్రాలను సృష్టించి మోసం చేయటంలో దిట్టా అనిపించుకుంటున్నారు. ఇందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన అడ్డాగా చేసుకుని రాజకీయ అండ దండలతో ఈ దందాలను మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు.సదరు భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యవహార శైలీ వల్ల తరుచుగా వచ్చే కేసులతో పోలీసు ఉన్నత అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. మన తెలంగాణ/సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేం ద్రం ఏర్పడిన నాటి నుండి రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అక్రమ దంధాను జోరుగా.. కొనసాగిస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అమాయక ప్రజలే వారి లక్షంగా ఎంచుకొని సంబంధంలేని భూములను సైతం నకిలీ ధృవ పత్రాలను సృష్టించి మో సం చేయుటలో దిట్టా అనిపించుకుంటున్నారు. ఇందు కు జిల్లా కేంద్రంలో ప్రధాన అడ్డాగా చేసుకుని రాజకీయ అండదండలతో ఈ దంధాలను మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. సదరు భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యవహార శైలీ వల్ల తరుచుగా వచ్చే కేసులతో పోలీసు ఉన్నత అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. అమాయక ప్రజలకు ఉన్న ఖాళీ స్థలాలను కంపచేనుతో బంధించి ఒకరికి తెలియకుండా మరొకరికి సంబంధిత స్థలాలను నలుగురు లేదా ఐదుగురికి అమ్మడంతో ఒక్కొక్కరి బాగో తం బట్టబయలు అవుతున్నప్పటికీ రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం వల్ల చివరికి వారు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడం ది. ఈ తంతు చివరి వరకు కొనసాగేలోపు రియల్‌ఎస్టేట్ వ్యాపారులతోపాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆర్ధికంగా లాభపడుతున్నప్పటికీ పోలీసులే నింధితులుగా మిగిలిపోతున్నారు. ఇందులో 90 శాతం సామా న్య ప్రజలు నష్టాల్లో కూరుకుపోయి లబోదిబోమంటూ తరచూ పత్రికల్లో ఎక్కుతున్నారు. కాగా అన్ని వర్గాల ప్ర జల బాగోగులు చూడాల్సిన పోలీసులు మాత్రం రోజు కు వచ్చే కేసులలో ఎక్కువ శాతం భూ వివాధాలకు సం బంధించినవే కావడంతో ముందునుయ్యి వెనుకగొయ్యి లా మారిన సమస్యలను పరిష్కరించేలేకపోతున్నారు. ఈ తంతు వారికి తలనొప్పిగా మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇందులో భాగంగా ఇటీవలే బాలెంల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 836 లో గల 2 ఎకరాల 14 గుంటల భూమిలో గల పత్తి చేను ధ్వం సం, పిల్లల మర్రి, గాంధీనగర్, బీబీగూడెం, కుడకుడ గ్రామ పంచాయతీలలోని పలు భూముల్లో, కొత్త కలెక్టరేట్ ఏర్పడనున్న ప్రాంతంలో సర్వే నెంబర్ 66 లోని 19 గుంటల వాస్తవమైన భూమి, ఎస్‌సి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ వ్యాపారి సొంత స్థలం, ఇందిరమ్మ కాలనీ మొదటి, రెండవ, మూడవ విడుతలతో పాటు ఎన్‌టిఆర్ కాలనీలో జరుగుతున్న సంఘనలు మచ్చుతునకలుగా మిగిలిపోతున్నాయి.
విలేకరుల స్థలాలు సైతం స్వాహా..
ప్రభుత్వనికి, ప్రజలకు వారధులగా ఉండి ఎలాంటి జీతభత్యాలు లేకుండా, నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తున్న కలంకారులను గుర్తించి ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలను సైతం భూ ఆక్రమదారులు గుటకాయిస్తున్నారు. ఏ మా త్రం వణుకు, బెనుకు లేకుండా అనుకున్నదే తడవుగా కొనుగోలుదారి దొరకగానే ఆక్రమార్కులు అట్టి స్థలాలను సైతం వారి సేవలను గుర్తించకుండా అమ్ముకొని దిగమింగుతున్నారు. చివరకు ప్రశ్నించిన విలేఖరులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారు.
నిద్రపోతున్న అధికార యంత్రాంగం
జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోను రియల్‌ఎస్టేట్ వ్యాపారులు బోదల్లా ఎడబడి ఖాళీ స్థలాలను అక్రమంగా అమ్ముకుంటున్నారన్న విషయాన్ని రెవిన్యూ అధికారులు గ్రహించినప్పటికీ అక్రమార్కులపై ఎటువం టి చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితుల్లో ఒక్కింత అనుమానాలకు రేకెత్తిస్తుంది. అధికారులు రియల్ వ్యా పారులతో చేతులు కలిపి అక్రమ దంధాను ప్రోత్సహిస్తున్నారనే విమర్శ ప్రజల్లో నెలకొంది. ఈ సమస్య నుండి గట్టెక్కించే పరిస్థితి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
సందిగ్ధంలో భూ కొనుగోలుదారులు
సూర్యాపేట జిల్లా కేంద్రం కావడంతో ఎంతో కొంత స్థలాలను కలిగి ఉన్న వ్యక్తులు తమ వారసుల కోసం కేటాయించిన స్థలాలను సదరు యాజమానులకు తెలియకుండా బోగస్ పట్టాలతో స్థలాలను విక్రయిస్తున్నారనే సమాచారం తెలుసుకుంటున్న భూ కొనుగోలుదారులు జిల్లా పరిసర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేయాలంటేనే వణికి పోతున్నారు. భయాందోళనకు గురౌతూ సందిగ్ధంలో ఉన్నప్పటికీ భూమి కొనుగోలు చే సి చివరికి ఇరకాటంలో పడుతున్నారు. ఏ భూమి నిజమైన ధృవపత్రాలు కలిగి ఉందో, ఏ భూమి నకిలీ దృవపత్రాలతో రిజిస్ట్రేషన్ కాబడి ఉందో కొనుగోలుదారలు తెలుసుకోలేకపోతున్నారు. దీనికి అంతటి కారణం రా బంధుల్లా వాలే రియల్‌ఎస్టేట్ వ్యాపారుల అక్రమ అధికార వ్యవహారం శైలియే అని ప్రజలు వాపోతున్నారు.
కోర్టులో కేసులు ఉన్నప్పటికీ…
తాజాగా కోరుట్టులో కేసులు ఉన్నప్పటికీ భూములకు సంబంధిత యాజమాలనులు, ఆక్రమదారుల మధ్యే గొ డవలు రోజురోజుకు ఉద్రేకమౌతూనే ఉన్నాయి. భూ అక్రమ వ్యాపారులు సదరు స్థలాల అమ్మకాలపై గోప్యం గా ఉంచి ఇతరులకు అమ్మడంతో సమస్య జటిలంగా మారి చివరకు ప్రాణాలు పోగోట్టుకునే పరిస్థితి దాపురిస్తుంది. ఇందులో అధికారపక్షం, ప్రతిపక్షం బడానాయకుల జోక్యం ఉండడంతో పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారుల సైతం ఏమీ చేయలేని నిత్సహాయ స్థితిలో ఉంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందోలేదో అన్ని వర్గా ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అ త్యంత విలువనిచ్చే ఓ బాధ్యతాపరమైన శాఖలో పనిచే స్తూ, నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులుగా పేరొందుతూనే ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తులు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో తమ శైలీని చాటుతుండడంతో ఆ శాఖ ఉన్నత స్థాయి అధికారులకు సైతం కాస్త తలనొప్పిగానే మారిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
నిజనిజాల నిగ్గు తేల్చుతాం : డి.సంజీవరెడ్డి, జాయింట్ కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ శుద్ధి సర్వే కార్యక్రమంలో ఏ ఒక్క భూమి కూడా అక్రమార్కులచెంత ఉండదు. నిజమైన భూ యాజమానికే ప్రభు త్వం రిజిస్ట్రేషన్ ప్రతిని సమర్పిస్తుంది. అప్పటివరకు వేచిచూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగిన భూ సర్వేలో అవకతవకలు ఉన్నట్లు ప్రజలకు అనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.
అక్రమార్కులు చట్టం నుండి తప్పించుకోలేరు : ప్రకాష్ జాదవ్, జిల్లా ఎస్‌పి
భూ అక్రమార్జన చేసేవారు చట్టం నుండి తప్పించుకోలేరు. వారిపట్ల చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రజ లు తమ భూమిని కోల్పోయినట్లు కోర్టులో కేసువేస్తే తీ ర్పు వచ్చేంతవరకు వేచిచూడాలి. అక్రమార్కులతో గొడవలుపడి నిజమైన యాజమానులు తమ ప్రాణాల మీద కు తెలచ్చుకోవద్దు. భూ కొనుగోలుదారులు నిజ నిర్ధార ణ చేసున్న తర్వాతే భూమి కొనుగోలు చేసుకోవాలి.