Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పెరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య

పెరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య

TTDఅమరావతి : ఎపి కేబినెట్ బుధవాం భేటీ అయింది. సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టిటిడి బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సభ్యుల సంఖ్యను 18 నుంచి 24కు పెంచింది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మరో నలుగురికి అవకాశం కలిపించనుంది. గతంలో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 19 మంది సభ్యులు ఉన్న టిటిడి ధర్మకర్తల మండలి ప్రస్తుతం కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సభ్యుల సంఖ్య 28కి చేరింది. దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం టిటిడి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారు.  తుడా చైర్మన్‌కు టిటిడి ధర్మకర్తల మండలిలో ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆర్ టిసి ని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీతో పాటు పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Increased Number Of TTD Trust Board Members