Home జాతీయ వార్తలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol And Dieselఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి.  పెట్రోల్ ధ‌ర‌పై 25 పైస‌లు, డీజిల్ ధ‌ర‌పై 24 పైస‌లు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. జూలై 5న కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత  ఈ స్థాయిలో ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.72.42 పైస‌లు. డీజిల్ రూ.65.82 పైస‌లుగా ఉంది. శ‌నివారం సౌదీలోని ఆరామ్కో చ‌మురు రిఫైన‌రీల‌పై దాడులు జ‌రిగాయి. ఈ దాడుల తరువాత ఇంధన ధరలు భగ్గమంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లో కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడంపై వినియోగదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Increased Petrol And Diesel Prices