Home తాజా వార్తలు విజయవాడ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ

విజయవాడ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ

Trafficయాదాద్రి-భువనగిరి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్‌గేట్ వద్ద రద్దీ నెలకొంది. టోల్‌ప్లాజాలోని 16 కౌంటర్లకు గాను 15 కౌంటర్లను హైదరాబాద్ – విజయవాడ మార్గంలో కేటాదయించారు. అయినప్పటికీ సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.