Thursday, April 25, 2024

పెరిగిన వాహనాల గ్రీన్ ట్యాక్స్.. ఆందోళనలో వాహనదారులు

- Advertisement -
- Advertisement -

Increased vehicle green tax

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశం పెట్టిన నూతన రోడ్డు సేఫ్టీ యాక్టులో పేర్కొన్న వాహనాలకు ఫిట్‌నెస్‌కు సంబంధించి రోజుకు రూ.50 ఫైన్ పై కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలు ఇంకా సద్దుమణగక ముందే వాహనదారులపై గ్రీన్ ట్యాక్స్ పేరుతో మరో భారం పడింది. పాత వాహనాలు గడువు తీరిన తర్వాత కూడా రోడ్డుమీద తిరగాలంటే సదరువాహనదారులు గ్రీన్‌ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే సదరు గ్రీన్‌ట్యాక్స్‌ను భారీగా పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత వరకు 15 సంవత్సరాలు దాటిన ద్విచక్కవాహనాలు రోడ్దు మీద తిరగాలంటే రూ.250 చెల్లిస్తే సరిపోయేది. కాని రవాణశాఖ అధికారులు దాన్ని రూ.500లకు పెంచారు.అదే విధంగా 20 సంవత్సరాలు ద్విచక్ర వావాహనాలకు రూ.దాటిన కార్లకు గ్రీన్ ట్యాక్ కింది రూ.500 చెల్లిసే సరిపోయేది. కాని పెరిగిన చార్జీల ప్రకార రూ.5000 చెల్లించాల్సి వస్తుంది.. తాను తన తండ్రి జ్ఞాపకార్దం తన తండ్రి ఉపయోగించిన వాహనాన్నే తాను కూడా వినియోగిస్తున్నాని ఇప్పటికే సదరు వాహనంపై ఒక సారి గ్రీన్ ట్యాక్స్ చెల్లించినట్లు రామ్‌నగర్‌కు సూర్యా అనే వాహనదారుడు తెలిపాడు.

అయితే తాను ఉపయోగిస్తున్న వాహనానాన్ని అమ్మకానికి పెట్టినా పెరిగిన గ్రీన్ ట్యాక్స్‌కు సరిపోను మొత్తం కూడా రాదంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనానలు పోలిస్తే పాత వాహనాలే మెరుగ్గా పని చేస్తున్నాయని ఆ ఉద్దేశ్యంతోనే తాను గత 20 సంవత్సరాల నుంచి పాత వాహానాన్నే వినియోగిస్తున్నట్లు ముషీరాబాద్‌కు చెందిన రామ్ తెలిపారు. అయితే పెరిగిన గ్రీన్‌ట్యాక్స్‌ను చెల్లించే కంటే వాటిని ఇంట్లోనే భద్రంగా పెట్టుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన దరలు పెరగడంతో అన్ని రకాల నిత్యావసర వస్తువుల దరలు పెరిగాయని ఈ విధంగా ట్యాక్స్‌లు పెంచుకుంటే పోతే తాము ఎలాని సదరు వాహన దారులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News