Thursday, March 28, 2024

ముస్తాబైన ‘మొతెరా’

- Advertisement -
- Advertisement -

సరికొత్త హంగులతో సర్దార్ పటేల్ స్టేడియం

ముస్తాబైన మొతెరా..

సామర్థం లక్ష పదివేలు
 నిర్మాణ వ్యయం రూ.678 కోట్లు
 నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి
 స్టేడియం విస్తీర్ణం 63 ఎకరాలు
 అవుట్ ఫీల్డ్ పరిమాణం 180 x 150 గజాలు
 ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఆరు, అవుట్ డోర్ పిచ్‌లు 3
 జిమ్ సౌకర్యంతో కూడిన డ్రెస్సింగ్ రూమ్‌లు 4
 గ్రౌండ్‌లో ప్రధాన పిచ్‌ల సంఖ్య 11
 కారు పార్కింగ్ సామర్థం 3 వేలు
 ద్విచక్ర వాహనాల పార్కింగ్ సామర్థం 10 వేలు
 కార్పొరేట్ బాక్స్‌లు 76

అహ్మదాబాద్ : ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న మొతెరా స్టేడియం భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మూడో టెస్టుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమయ్యే చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌తో మొతెరా స్టేడియం ప్రస్థానం ఆరంభం కానుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి) కంటే కూడా అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతెరా) స్టేడియం చాలా పెద్దది. ఈ స్టేడియం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఎంసిజి గ్రౌండ్‌కు దీటుగా మొతెరా స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇక బుధవారం జరిగే మ్యాచ్‌తో ఈ చారిత్రక స్టేడియం అభిమానులకు అందుబాటులోకి రానుంది. నిజానికి మొతెరా స్టేడియం చాలా పాతది. సర్దార్ పటేల్ స్టేడియంగా కూడా పిలిచే మొతెరా గ్రౌండ్‌లో 1983లోనే తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్‌లో పది వేల పరుగుల మైలురాయిని చేరుకుంది కూడా మొతెరా స్టేడియంలోనే. అంతేగాక మరో భారత దిగ్గజం కపిల్‌దేవ్ తన 432వ టెస్టు వికెట్‌తో న్యూజిలాండ్ స్టార్ రిచర్డ్ హ్యాడ్లి పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొట్టిందికూడా ఈ మైదానంలోనే కావడం విశేషం. ఇదిలావుండగా 2006 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మొతెరా స్టేడియంలో ఆధునీకికరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదిలావుండగా ఈ స్టేడియంలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2012లో జరిగింది. ఆ తర్వాత గుజరాత్ క్రికెట్ సంఘం స్టేడియాన్ని పూర్తిగా కొత్తగా నిర్ణయించాలని భావించింది. ఇందులో భాగంగా స్టేడియాన్ని పునాదుల నుంచి కూలగొట్టి సరికొత్తగా నిర్మించారు.

2017 జనవరిలో స్టేడియం నిర్మాణం పనులు ఆరంభమయ్యాయి. మూడేళ్ల తర్వాత స్టేడియం నిర్మాణం పూర్తయ్యింది. మరోవైపు గత ఏడాది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి కూడా మొతెరా కొత్త స్టేడియం వేదికగా నిలిచింది. ఇటీవల జరిగిన దేశవాళి ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ పోటీలకు మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ స్టేడియం ఆరంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం భారత రాష్ట్రపతి రామ్‌నాథన్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తదితరులు ఆరంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇక భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మూడో టెస్టుతో మొతెరా కొత్త స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతితో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడు పోయాయి. ఆధునీక సౌకర్యాలతో నిర్మించిన మొతెరా స్టేడియంలో జరిగే గులాబీ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IND v ENG 3rd Test to Starts in Motera Stadium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News