Home ఆసియా కప్ 2018 భారత్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ ‘టై’

భారత్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ ‘టై’

IND vs AFG: match ends in a tie

దుబాయి: ఆసియా కప్‌లో టీమిండియాకు ఊహించని ఫలితం వచ్చింది. పసికూన అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి వరకు భారత్ దే విజయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ అద్భుతమైన ఆట తీరుతో ఆటకట్టుకుంది. పోరాడి భారత్‌తో మ్యాచ్‌ను టైగా ముగించింది. రాహుల్‌ (60), రాయుడు (57) అర్ధ శతకాలతో రాణించినా ఆఖర్లో టీమిండియా తడబడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహ్మద్‌ షెహజాద్‌ (116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124), మహ్మద్‌ నబీ (64) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు 3, కుల్దీప్ 2,  ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, జాదవ్‌లకు తలో వికెట్ దక్కాయి. ఆ తర్వాత 253 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. దినేశ్‌ కార్తీక్‌ (44), జడేజా (25) పరుగులతో ఫర్వాలేదనిపించారు. సెంచరీ హీరో షెహజాద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డ్ దక్కింది.