Thursday, April 25, 2024

అదరగొట్టిన ఆస్ట్రేలియా.. 109 పరుగులకే కుప్పకూలిన భారత్..

- Advertisement -
- Advertisement -

అదరగొట్టిన ఆస్ట్రేలియా
చెలరేగిన కుహ్నెమన్, లియాన్
భారత్ 109 ఆలౌట్, ఆసీస్ 156/4
ఇండోర్: భారత్‌తో ఇక్కడి హోల్కర్ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమిండియాను ఆస్ట్రేలియా 109 పరుగులకే పరిమితం చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కంగారూలు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఆసీస్‌కు 47 ఆధిక్యం లభించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (60), మార్నస్ లబుషేన్ (31), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (26) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి హాండ్స్‌కొంబ్ 7, కామెరూన్ గ్రీన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ పడగొట్టిన నాలుగు వికెట్లు కూడా రవీంద్ర జడేజాకే దక్కాయి. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన జడేజా 63 పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు.

కుహ్నెమన్ జోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌కు బదులు శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమయ్యాడు. 3 ఫోర్లతో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (12) కూడా నిరాశ పరిచాడు. ఈ వికెట్ కూడా కుహ్నెమన్‌కే దక్కింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఒక పరుగు మాత్రమే చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0)లు కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు.

దీంతో భారత్ 45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మరోవైప సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి (22) పరుగులు చేసి మర్ఫి చేతికి చిక్కాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ 12 (నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కుహ్నెమన్ 16 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇదిలావుంటే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 20 ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News