Friday, March 29, 2024

విలవిల్లాడిన భారత బ్యాట్స్‌మెన్స్.. ఇంగ్లాండ్ 120/0

- Advertisement -
- Advertisement -

IND vs ENG 3rd Test: India 78 All Out against Eng

లీడ్స్: భారత్‌తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా రాణించి నిప్పులు చెరిగే బంతులతో టీమిండియాను వందలోపే ఆలౌట్ చేశారు. జేమ్స్ అండర్సన్ చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అతని ధాటికి ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0), చటేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (7) పెవిలియన్ చేరారు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానె (18), ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రోహిత్ 105 బంతుల్లో 19 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రహానె 54 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేశాడు.

ఇక ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, క్రెగ్ ఓవర్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా, శామ్ కరన్, రాబిన్సన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు ఓపెనర్స్ బర్న్స్(52), హమీద్(60)లు భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా 120 పరుగులు చేసింది.

IND vs ENG 3rd Test: India 78 All Out against Eng

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News