Saturday, April 20, 2024

ఆదుకున్న రాహుల్, హార్దిక్.. టీమిండియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

టీమిండియాకు సిరీస్
ఆదుకున్న రాహుల్, హార్దిక్
కుల్దీప్, సిరాజ్ మ్యాజిక్
రెండో వన్డేలోనూ శ్రీలంక ఓటమి
కోల్‌కతా: శ్రీలంకతో గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్‌లో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య టీమిండియా 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఆరంభంలోనే షాక్
సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోఏ షాక్ తగిలింది. కిందటి మ్యాచ్‌లో శుభారంభం అందించిన ఓపెనర్లు రోహిత్ శర్మ(17), శుభ్‌మల్ గిల్(21)లు ఈసారి నిరాశ పరిచారు. సెంచరీ హీరో విరాట్ కోహ్లి (4) కూడా విఫలమయ్యాడు. కొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్ (28) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
రాహుల్ పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తనపై వేసుకున్నాడు. హార్దిక్ పాండ్య అండతో స్కోరును ముందుకు నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన హార్దిక్ 4 ఫోర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ (21) కూడా తనవంతు పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 103 బంతుల్లో ఆరు ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 10(నాటౌట్)తో కలిసి భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, సిరాజ్‌లు హడలెత్తించారు. ఇద్దరు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక లంక జట్టులో ఓపెనర్ ఫెర్నాండో (50), కుశాల్ మెండిస్ (34)లు మాత్రమే రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News