Thursday, March 28, 2024

అమీతుమీ.. సిరీస్ విజయంపై భారత్‌, శ్రీలంక నజర్

- Advertisement -
- Advertisement -

అమీతుమీ.. సిరీస్ విజయంపై భారత్‌శ్రీలంక నజర్
నేడు సౌరాష్ట్ర వేదికగా కీలక మూడో టి20
రాత్రి 7గంటలకు అంతిమపోరు
హోరాహోరీగా తలపడనున్న ఇరుజట్లు
రాజ్‌కోట్: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్ తుది అంకానికి చేరి రసవత్తరంగా మారింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆతిథ్య భారత్, పర్యాటక శ్రీలంక చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ నిర్ణాయాత్మక మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. శనివారం క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

గుజరాత్‌లోని సౌరాష్ట్ర వేదికగా నేటి రాత్రి పొట్టి సిరీస్ తుదిపోరు జరగనుంది. ముంబయిలో వాంఖడే వేదికగా హోరాహోరీగా జరిగిన టి20లో భారతజట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. బ్యాటర్లు చేతులెత్తేసినా బౌలర్లు వారి బాధ్యత తీసుకుని జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అక్షర్‌పటేల్, దీపక్‌హుడా బ్యాట్‌తో జట్టును ఆదుకోవడం విశేషం.తొలి మ్యాచ్ విజయం బౌలర్లదే అనడంలో సందేహం లేదు. అయితే పుణే వేదికగా జరిగినరెండో టి20లో శ్రీలంక 16పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. రెండో టి20లో శ్రీలంక కెప్టెన్ శనక 2ఫోర్లు, 6సిక్సర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి హాఫ్‌సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ కుశాల్ మెండిస్ కూడా అర్ధశతకంతో నిశాంక 33పరుగులతో జట్టుకు అండగా నిలిచి మంచి ఆరంభాన్ని అందించారు. రాజ్‌కోట్ అన్నిఫార్మాట్లలో భారీ స్కోరును అందిస్తోంది. ఇక్కడ జరిగిన నాలుగో టి20ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిణ రెండు జట్లు విజయం సాధిస్తే, ముందుగా బౌలింగ్ చేసిన రెండుజట్లు విజయాన్ని నమోదు చేశాయి. పిచ్ రిపోర్టును బట్టి శ్రీలంక శనక రెండో టి20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు భారత్ డెత్ బౌలింగ్‌లో కంగు తినడంతో పేస్ విభాగంలో అర్షదీప్‌సింగ్‌పై వేటు వేసే అవకాశం ఉంది. రెండో టి20లో రెండు ఓవర్లు వేసిన అర్షదీప్ 5నో బాల్స్‌వేసి సమర్పించుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈనేపథ్యంలో సిరీస్‌లోని చివరి టి20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News