Tuesday, April 16, 2024

స్వతంత్రుల హవా

- Advertisement -
- Advertisement -

Municipal-Eelctions

 

పలు పట్టణాల్లో ప్రధాన పార్టీలను దాటిపోయిన ఇండిపెండెంట్లు

హైదరాబాద్ : పురపోరులో స్వతంత్య్ర అభ్యర్ధులు సత్తాచాటుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలను దాటుకుని ఘన విజయం సాధించారు. ముఖ్యంగా స్వతంత్య్ర అభ్యర్ధుల ముందు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు నిలబడలేకపోయాయి. ఫలితంగా పలు మున్సిపాలిటీల్లో అధికార టిఆర్‌ఎస్ తరువాత వారు గెలిచిన వార్డులు అధికంగా ఉండడం విశేషం. ఈ పరిణామాన్ని చూసి కాంగ్రెస్, బిజెపి వర్గాల్లో తీవ్ర విస్మయం నెలకొంది.

అధికార పార్టీకి దీటుగా పురపోరులో ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ విజయం ముంగిట మాత్రం బొల్తాపడ్డారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల పరాజయం యాత్ర ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఓటు బ్యాంకును, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో దూసుకపోతోంది. ఎన్నికల్లో కారు స్పీడును నామమాత్రంగా కూడా అందుకోలేకపోతున్నాయి.

దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల భవిష్యత్‌పై మరోసారి ప్రశ్నార్ధకంగా మారిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చివరకు చిన్న చిన్న వార్డుల్లో కూడా కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులు స్వతంత్య్ర అభ్యర్ధులతో కూడా పోటీ పడలేకపోయారు. దీంతో పలు మున్సిపాలిటీల్లో వారి స్థానం తరువాత ప్రధాన ప్రతిపక్షాల అభ్యర్ధులు ఉండడం విశేషం.

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగగా స్వతంత్య్ర అభ్యర్ధులు సుమారు 15 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి కంటే అధికంగా గెలిచారు. వాటిల్లో బెల్లిపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా టిఆర్‌ఎస్ …25 వార్డులు గెలుచుకోగా, బిజెపి..1, కాంగ్రెస్..2 వార్డులకే పరిమితమయ్యాయి. కాగా స్వతంత్రులు మొత్తంలో ఆరు వార్డులను గెలుచుకున్నారు. మొత్తమ్మీద 260 వార్డులను స్వతంత్రులు గెలవడం విశేషం.

 

Independent candidates winning in Municipal elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News