Saturday, April 20, 2024

మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144/4

- Advertisement -
- Advertisement -

 

వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి  భారత్ 65 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) అర్థసెంచరీతో రాణించిగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా(14), నయా వాల్ చటేశ్వర పుజారా(11), కెప్టెన్ విరాట్ కోహ్లీ(19)లు రెండో రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానె(25), హనుమ విహారి(15)లు వికెట్లను కాపాడుకుంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లేందుకు కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసేసమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన భారత్, కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 39 పరుగులు వెనకపడి ఉంది. కివీస్ బౌలర్లో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాపై కివీస్ కు 183 పరుగుల భారీ ఆధక్యం లభించింది.

India 2nd Innings 144/4 against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News