Home జాతీయ వార్తలు విబేధాలు లేని వాణిజ్యం కావాలి

విబేధాలు లేని వాణిజ్యం కావాలి

modi

సింగపూర్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సింగపూర్ లోని నన్ యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. 21వ శతాబ్ధం ఆసియాకు చెందుతోందని ప్రపంచ దేశాలు అంగీకరించాయని ప్రధాని పేర్కొన్నారు. అయితే ఆసియా దేశాలు కూడా అదే దృక్పథం తో ముందుకు సాగలని ఆయన పిలుపునిచ్చారు. మానవ చరిత్రను పరిశీలన చేస్తే అనేక శతాబ్ధాలు వాణిజ్యంలో భారత్, చైనాలు అధిపత్యాన్నికనబరిచాయని స్పష్టం చేశారు. కానీ ఆ సందర్భంలో ఇరు దేశాల మధ్య ఎలాంట విభేదాలు లేవని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వాణిజ్యం చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. సింగపూర్ పిఎంకు 6వ శతాబ్ధానికి చెందిన బుద్దగుప్త నమూనాను బహుమతిగా ఇచ్చారు. ఆ బౌద్దగుప్త నమూనాపై సంస్కృత శ్లోకాలు ఉండటం గమనార్హం. ఒరిజినల్ బౌద్దగుప్త స్థూపం కోల్ కతా మ్యూజియంలో ఉంది.