Friday, April 26, 2024

రాజస్థాన్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ బలగాలు, పాక్ రేంజర్ల కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) ట్రూప్‌లు, పాకిస్థాన్ రేంజర్లు ఒకరిపై మరొకరు శుక్రవారం బాగా చీకటి పడ్డాక కాల్పులు జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని ఇండియా, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అనుప్‌గఢ్ సెక్టార్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారలు తెలిపారు. భారత్ వైపు ఎవరూ చనిపోలేదని కూడా వారు స్పష్టం చేశారు.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలోని అనుప్‌గఢ్ సెక్టార్‌లో ఫ్లాగ్ మీటింగ్‌కు రమ్మని పాకిస్థాన్ రేంజర్లను బిఎస్‌ఎఫ్ పిలిచినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ వైపు నుంచే మొదట కాల్పులు జరిగాయని, తర్వాతే భారత బిఎస్‌ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని అక్కడి స్థానికులు తెలిపారు. రాజస్థాన్ ఫ్రంట్‌లో ఇలా బలగాలు ఎదురు కాల్పులు జరుపుకోవడం చాలా అరుదు. రాజస్థాన్ ఫ్రంట్ అనేది గుజరాత్, పంజాబ్, జమ్ము అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఉంటుంది. సరిహద్దు బలగాల అధికారుల నుంచి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News