Home జాతీయ వార్తలు భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల భేటీ!

భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల భేటీ!

India and Pakistani Foreign Ministers meet in New York

న్యూఢిల్లీ: మళ్లీ చర్చలు మొదలుపెడదామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభ్యర్థన మేరకు ఆ దిశగా భారత్ తొలి అడుగు వేసింది. వచ్చే వారం న్యూయార్క్‌లో భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొనున్నారు. ఆ తరువాత భేటీ కానున్నారు. అయితే ఇది కేవలం సమావేశం మాత్రమే, చర్చల ప్రక్రియ మొదలుపెట్టినట్టు కాదుని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. పాక్ అభ్యర్థన మేరకే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీల భేటీకి భారత్ అంగీకరించింది. ప్రస్తుతానికి సమావేశానికి మాత్రమే అంగీకరించామని, ఎజెండా మాత్రం ఇంకా రూపొందించలేదు అని రవీష్‌కుమార్ స్పష్టం చేశారు.