Wednesday, November 6, 2024

ప్రపంచ ఆహార భద్రత సూచీలో భారత్ @ 71

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార భద్రత(జిఎఫ్‌ఎస్) సూచీ 2021 ప్రకారం లెక్కలోకి తీసుకున్న 113 దేశాల్లో భారత ర్యాంకు 71వ స్థానంలో ఉంది.  ఆహార లభ్యత విషయంలో శ్రీలంక 62.9 పాయింట్లు, పాకిస్థాన్ 52.6 పాయింట్లు కలిగి ఉంటే భారత్ మాత్రం 50.2 పాయింట్లకే పరిమితమైంది. లండన్‌కు చెందిన ‘ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అండ్ కోర్‌టేవా ఆగ్రిసైన్స్’ మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 113 దేశాల్లో భారత్ ఓవరాల్ స్కోర్ 57.2తో 71వ స్థానంలో ఉంది. కాగా పాకిస్థాన్ 75వ స్థానం, శ్రీలంక 77వ స్థానం, నేపాల్ 79వ స్థానం, బంగ్లాదేశ్ 84వ స్థానంలో ఉన్నాయి.

ఆహార భద్రత విషయంలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా టాప్ ర్యాంకర్లుగా ఉన్నాయి. ఆ దేశాలు సూచీలో 77.8 పాయింట్ల నుంచి 80 పాయింట్ల వరకు నమోదుచేశాయి.
అందుబాటు, దొరకడం, నాణ్యత, భద్రత, ఆహారాన్ని ఉత్పత్తి చేసే సహజ వనరులు, స్థితిస్థాపకత(రిసిలియన్స్) వంటి కారకాలు పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఆహార భద్రత సూచీని కోర్‌టెవా ఆగ్రిసైన్స్ రూపొందిస్తుంది. మొత్తంగా చూసినప్పుడు గత 10 ఏళ్లలో భారత్ కన్నా పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు ముందునాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News