Wednesday, November 6, 2024

బ్రిస్బేన్ నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం

- Advertisement -
- Advertisement -

Team India beat Australia and win the Border-Gavaskar Series 2-1

బ్రిస్బేన్ టెస్టు: నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు భారత్ ఓటమి రుచి చూపించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. కీలక ఆటగాళ్లు లేకపోయిన భారత్ యువ ఆటగాళ్లు సత్తా చాటారు. గిల్, పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. 91 పరుగులతో జట్టుకు శుబ్ మన్ గిల్ చక్కని పునాది వేశాడు. పుజారా (56), పంత్(89), సుందర్(22) పురుగులతో 3 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురువేసింది భారత్. గబ్బా స్టేడియంలో సీనియర్ ఆటగాళ్లు లేకున్నా జూనియర్లు ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే మట్టి కరిపించి అత్యధిక స్కోరును చేధించారు. ఉత్కంఠభరితంగా సాగిన నాల్గొ టెస్టులో భారత్ అద్భుతంగా రాణించి సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందింది.

India beat Australia and win the Border-Gavaskar Series 2-1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News