Thursday, April 25, 2024

దంచికొట్టిన రాహుల్, ఇషాన్: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు

- Advertisement -
- Advertisement -

దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కెఎల్.రాహుల్, ఇషాన్ కిషన్‌లు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ సమన్వయంతో ఆడగా, రాహుల్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన రాహుల్ స్కోరును పరిగెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 24 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (11) నిరాశ పరిచాడు. అయితే రిషబ్ పంత్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడిన ఇషాన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేసి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. చెలరేగి ఆడిన రిషబ్ పంత్ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 29 పరుగులు చేశాడు. హార్దిక్ 12(నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను బెయిర్‌స్టో (49), మోయిన్ అలీ 43 (నాటౌట్), లివింగ్‌స్టోన్ (30) ఆదుకున్నారు. మోయిన్ చివర్లో ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది.

India beat England with 7 wickets in Warm up match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News