Thursday, March 28, 2024

కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసిన భారత్..

- Advertisement -
- Advertisement -

దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దాంతోపాటు మరణాల సంఖ్యకు పెరుగుతోంది. గత 24 గంటల్లోనూ దేశంలో దాదాపు లక్షా 70వేల కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి 35 లక్షలకు పైగా చేరుకుంది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ను దాటేసి 2వ స్థానంలో ఉంది. ఇక, మూడు కోట్లకు పైగా కేసులతో అగ్రరాజ్యం అమెరికాలో మొదటి స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌లో మొత్తం కోటి 34 లక్షలకు పైగా కేసులతో మూడో స్థానంలో ఉంది.

India become 2nd worst affected of Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News