Wednesday, February 1, 2023

ఫ్రాన్స్‌లో పిఒకె అధ్యక్షుడి ప్రసంగానికి బ్రేక్

- Advertisement -

Masood-Khanన్యూఢిల్లీ : పొరుగు దేశం పాకిస్థాన్‌కు మరో దౌత్యభంగపాటు ఎదురైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) అధ్యక్షులు మసూద్ ఖాన్ ఫ్రెంచ్ పార్లమెంట్‌లో ప్రసంగించకుండా భారతదేశం విజయవంతంగా అడ్డుకుంది. గత నెల ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో పిఒకె అధ్యక్షులు ప్రసంగించేలా చేసేందుకు పారిస్‌లోని పాకిస్థాన్ దౌత్య బృందం తీవ్రంగా యత్నించింది. ఈ ప్రసంగం సందర్భంగా కశ్మీర్ అంశాన్ని విస్తృత స్థాయిలో ప్రస్తావించాలని, ఏదో విధంగా ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని పాకిస్థాన్ యత్నించింది. దీనిని ముందుగానే పసికట్టిన పారిస్‌లోని భారత దౌత్య బృందం ఈ ప్రయత్నాలను చిత్తు చేసింది. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వశాఖకు పంపించిన నోట్‌లో అన్ని అంశాలను ప్రస్తావించారు.

జమ్మూ కశ్మీర్ భారతదేశపు అంతర్భాగమని, పిఒకె వివాదాస్పద ప్రాంతం అని, అక్కడి నుంచి ఒక నేతకు ప్రసంగించే అవకాశం కల్పించడం సముచిత కాదని భారతదేశం తమ అధికారిక డిమార్చ్‌లో తెలిపింది. పిఒకె అధ్యక్షుడి రాకకు ప్రసంగానికి వీలు కల్పిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రసంగానికి అనుమతిని ఇవ్వడం భారత సార్వభౌమాధికారానికి ప్రతిఘాతంగా మారుతుందని తెలిపారు. మరో వైపు ప్రవాస భారతీయులు కూడా ఈ ప్రసంగంపై నిరసనను వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ స్పీకర్‌కు, ఎంపిలకు ఈ మొయిల్స్ పంపించారు. ఈ ప్రయత్నాలకు ముందు ఫ్రెంచి పార్లమెంట్ దిగువ సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఫ్రాన్స్ నుంచి పిఒకె నేతకు ఆహ్వానం పంపించారు. అయితే భారతదేశం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం రావడంతో ఆ తరువాత ఫ్రాన్స్ ప్రభుత్వం తప్పు సరిదిద్దుకుంది. ఆయనకు అనుమతిని ఇవ్వడం లేదని తెలిపారు. దీనితో మసూద్ ఖాన్ పర్యటన ప్రసంగం రద్దయింది.

కేవలం ఆయన తరఫున దౌత్యవేత్త మోని ఉల్‌హక్ సభలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం పాకిస్థాన్ దౌత్యవేత్తలు తప్ప ఇతరులు ఎవరూ హాజరు కాలేదు. మసూద్ గౌరవార్థం ఏర్పాటు అయిన విందు కూడా రద్దు అయింది. మసూద్ ప్రసంగం రద్దు కావడం భారత దౌత్య పట్టుకు మరో విజయంగా పరిశీలకులు విశ్లేషించారు. పారిస్‌లోని పాక్ ఎంబసీ తరఫున మసూద్ పార్లమెంట్ ప్రసంగానికి అత్యంత పకడ్బందీగా యత్నాలు జరిగాయని వెల్లడైంది. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్ పాకిస్థాన్‌ల సంబంధాలు పూర్తిగా దిగజారాయి. అంతర్జాతీయ వేదికల నుంచి ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని ప్రస్తావించాలని, తద్వారా భారతదేశంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని పాకిస్థాన్ శతవిధాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

India blocks PoK President event in French Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles