Home జాతీయ వార్తలు భారత్- బ్రెజిల్ 15 ఒప్పందాలు

భారత్- బ్రెజిల్ 15 ఒప్పందాలు

India-Brazil

 

ప్రధాని మోడీతో బోలోనారో చర్చలు

న్యూఢిల్లీ : వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, చమురు సహజవాయువు వంటి విభిన్న రంగాలకు సంబంధించి భారత్ బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైబర్ సెక్యూరిటీ, ఐటి రంగాలలో కూడా పరస్పర సహకార విస్తృతి దిశలోఈ ఒప్పందాలు కుదిరాయి. భారత పర్యటనకు వచ్చిన బ్రెజిల్ అధ్యక్షులు జైర్ మెస్సియస్ బోల్సోనారో శనివారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో విస్తృత చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఒప్పందాలకు వీలేర్పడింది. తమ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, వీటి పటిష్టత దిశలో కార్యాచరణను కూడా ఖరారు చేసుకున్నట్లు ఆ తరువాత ప్రధాని మోడీ తెలిపారు. బ్రెజిల్ భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత దిశలో జైర్ పర్యటన మరో మలుపు అవుతుందన్నారు. తన కూతురు లౌరా, కోడలు లెటిసియా ఫర్మో, ఎంపిలు, వ్యాపార వేత్తల బృందాలతో కలిసి బ్రెజిల్ నేత శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఆదివారం దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవానికి బ్రెజిల్ అధ్యక్షులు అతిథిగా హాజరుకానున్నారు.

India, Brazil ink 15 pacts to boost ties further