Friday, April 26, 2024

భారత్‌బ్రిటన్ మధ్య రూ.10,232 కోట్ల ఒప్పందం

- Advertisement -
- Advertisement -

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానుల భేటీ

India Britain deal worth Rs 10232 crore
లండన్ : భారత్, బ్రిటన్ దేశాల మధ్య 1 బిలియన్ పౌండ్లు (రూ.10,232 కోట్లు) విలువచేసే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాల్లో భాగంగా వాణిజ్య భాగస్వామ్యం పెంచే ఒప్పందాలు జరిగాయి. 2030 నాటికి బ్రిటన్ భారత్ వాణిజ్యం రెట్టింపు లక్షంగా జరిగిన భేటీలో జాన్సన్ కంపెనీతో 1 బిలియన్ పౌండ్ల విలువచేసే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదిరింది. దీనిలో భారతీయ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందంతో కరోనాతో సతమతమవుతున్న ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం లభించనుంది. అదే సమయంలో బ్రిటన్‌లో 6500 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సీరమ్ 240 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు
ఈ పెట్టుబడుల్లో భాగంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) బ్రిటన్‌లో దాదాపు 240 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనుంది. సీరమ్ ఈ పెట్టుబడి బ్రిటన్‌లో అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా పేర్కొంటున్నారు. సీరమ్ పెట్టుబడులతో బ్రిటన్‌లో ఈ సంస్థ వ్యాక్సీన్ వ్యాపారం చేయడం, ఇంకా కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News