Home ఆదిలాబాద్ మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

Gandhiగణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ మైదానంలో పాఠశాలల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మావల పంచామతీ పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు జననీ…జననీ…జననీ జై జన్మభూమి అనే పాటపై నృత్యంతో అదరగొట్టగా, ఆదిలాబాద్ కేజీబీవీ విద్యార్థులు చిన్నామా బతుకమ్మ. చిన్నారింకా బతుకమ్మ పాటపై చేసిన నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను తెలియజేసేలా ప్రదర్శించిన శకటాలు విశేషంగా అకట్టుకున్నాయి. డ్వామా, డీఆర్‌డీఏ, హౌజింగ్, ఆర్‌డబ్లూఎస్, పౌరసరఫరాలు, రెవెన్యూ, అటవీ, రాజీవ్ విద్యామిషన్, కేజీబీవీ, వైద్యాఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఎస్సీ కార్పొరేషన్, అత్యవసర పసర్వీసులైన 108, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. సంబంధిత శాఖ అధికారులు తమ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి శకటాల ముందు నడుస్తు వారు చేస్తున్న అభివృద్దిని ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ శకటంగా మొదటి స్థానంలో గ్రామీణ నీటీసరఫరా విభాగం, రెండవ స్థానంలో ఐటీడీఏ, మూడవ స్థానంలో వైద్య ఆరోగ్య శాఖ శకటాలు నిలిచాయి.
-మన తెలంగాణ / ఆదిలాబాద్ అర్బన్

సిర్పూర్(టి)లో: గణతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని సిర్పూర్ టి మండలంలోని పలు పాఠశాలల్లో మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రమేష్‌బాబు, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి రేఖ, ఎంఈవో కార్యాలయంలో ఆరే ప్రకాష్, ఎఓ కార్యాలయంలో ప్రసాద్, ఎఫ్‌ఆర్‌వో కార్యాలయంలో గంగాదర్, ఐసిడిఎస్‌కార్యాలయంలో వనజ, గ్రామ పంచాయితీలో సర్పంచ్ సయ్యద్, హుడుకులి గ్రామపంచాయితీలో సర్పంచ్ నిర్మల, వెంకట్రావ్ పేట గ్రామ పంచాయితీలో సంతోష్, సారిగాం గ్రామపంచాయితీలో కమళ, లోలవెల్లి లో గణేష్, భూపాల పట్నం లో భాగ్య, చీలపెల్లి అర్జు, వ్యవసాయ సహాకార కార్యాలయంలో చైర్మన్ గౌడ్ లు ఘనంగా జెండాలు అవిష్కరించారు.
సిర్పూర్(టి) ఎస్‌ఐకి ఉత్తమ అవార్డు
ప్రజలకు నమ్మకంగా ఉండి, ప్రజా సేవలో మేముసైతం అని పాటుపడ్డ సిర్పూర్ టి ఎస్‌ఐ రామారావుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జగన్మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు.
బాసరలో
republicబాసర ట్రిపుల్‌ఐటిలో గణతంత్ర దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్‌సిసి విద్యార్థులు మార్ఛ్‌ఫాస్ట్ నిర్వహించారు. క్రీడపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. సర్పంచ్ శైలజ సతీశ్వర్‌రావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నర్సింగ్, ఆలయంలో ఇఓ వెంకటేశ్వర్లు, పిహెచ్‌సిలో వైద్యురాలు సిందూరి, రైల్వేస్టేషన్‌లో మిశ్రా, ఎస్‌సి, బిసి హాస్టల్ వార్డెన్స్‌లు కుమార్, నాగ్‌నాథ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలుగా నాగభూషణం, శారద, హంసవాహిని, శాంకరీ పాఠశాలల్లో హెచ్‌ఎంలు జెండాలను ఎగురవేశారు.
తాంసి మండలంలో
గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రంతో పాటు హస్నాపూర్, పొన్నారి, వడ్డాడి, కప్పర్ల, బండాల నాగపూర్, కరంజి, జామిడి, ధనోర, భీంపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, కళశాలల్లో, పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండాలను ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
సారంగాపూర్‌లో..
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పాఠశాలల్లో విద్యార్థులు, యువజన సంఘాలు, యూత్ సభ్యులు జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. మండల కేంద్రంలోని పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సహంగా నృత్యాల పోటీల్లో పాల్గొన్నారు. కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 50 మీటర్ల జాతీయ జెండాతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఇండెన్ గ్యాస్ నిర్వాహకులు సిలిండర వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సిర్పూర్(యు)లో
Flagగణతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు , గ్రామ కూడల్లు , అంగన్‌వాడి, గ్రామపంచాయతీ కేంద్రాల్లో రిపబ్లిక్‌డేను పురస్కరించుకొని త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. పాఠశాలల వారిగా ఉదయం పూట విద్యార్థుల ర్యాలీలు హోరెత్తించాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూతో పాటు ఎంపీడీఓ, తహసిల్దార్ కార్యాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఐకేపీ కార్యాలయంతో పాటు ఎంపీడీఓ కార్యాలయం, పోస్టల్, గ్రామపంచాయితీ, పోలీసు స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు వెటర్నరి, గ్రామపంచాయితీల్లో గణతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కేజీబీవీలో ముగ్గుల పోటీలు నిర్వహించగా విద్యార్థినీలకు బహుమతులు ప్రధానం చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో వందన సమర్పన చేశారు.
రెబ్బెన మండలంలో
రెబ్బెన మండలం కేంద్రంలో పలు గ్రామం పంచాయతీలలో జాతీయ ఎండాలు మంగళవారం రెపరెప లాడాయి. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రమేష్‌గౌడ్ గాంధీ పటానికి పూల మాలలు వేసి జెండాను ఎగరవేశారు.
గోలేటిలో…
బెల్లంపల్లి ఏరియాలో గోలేటి జీయం కార్యాలయంలో జీయం రవిశంకర్, అదేవిదంగా సింగరేణి పాఠశాలలో జెండాను ఎగరవేసి పలు సందేశాన్ని ఇచ్చారు. ఎఐటియుసి కార్యాలయంలో బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షుడు నల్గొండ సదాశివ్, ఐఎన్‌టీయుసి కార్యాలయంలో ఏరియా కార్యదర్శి ఎస్ ప్రకాష్‌రావు, టీఎన్‌టీయుసి కార్యలయంలో ఏరియా కార్యదర్శి వెంకటేశ్‌గౌడ్‌లు జెండాలు ఎగరవేశారు.
కాగజ్‌నగర్‌లో
పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్ సీపీ విద్యావతి త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ రమేష్‌బాబు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్, డీఎస్‌పి కార్యాలయంలో డీఎస్‌పి చక్రవర్తి, పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇంచార్జి సీఐ కృష్ణమూర్తి, డీఎఫ్‌ఓ కార్యాలయంలో డీఎఫ్‌ఓ రవిప్రసాద్, విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంలో డీఈ రాజన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి శారద, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ బిక్షపతి, మార్కెట్ యార్డులో కార్యదర్శి సదానందం, రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద, ఐఎన్‌టియూసి కార్యాలయంలో మాజీ జడ్పి చైర్మన్ సిడాం గణపతి, టీఎస్‌టియూసి కార్యాలయంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గణపురం ప్రకాష్, బీఎంఎస్ కార్యాలయంలో కల్లోల భట్యాచార్య, లారీ చౌరస్తా వద్ద బీజేపి తాలూకా ఇంచార్జి ఇందూరి వెంకటేశం, పద్మశాలీ పట్టణ సేవా సంఘం కార్యాలయంలో అధ్యక్షులు సామల రాజయ్యతో పాటు జెండాను ఎగరవేశారు.
నార్నూర్‌లో
గణతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు , గ్రామ కూడల్లు , అంగన్‌వాడి, గ్రామపంచాయతీ కేంద్రాల్లో రిపబ్లిక్‌డేను పురస్కరించుకొని త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్ నాయక్, జడ్పిటీసీ రూపావంతి జ్ఞానోబ పుష్కర్, సర్పంచ్ గజానంద్ నాయక్, తహసిల్దార్ దేవానంద్, ఎంపీడీఓ సలేంద్ర సుధాకర్, ఎంఈఓ మధుకర్, ఐకేపీ ఏపీఎం గురుచరణ్, ఎంపీటీసీలు జాలంసింగ్ పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్‌లో
మండలంలోని పెంబి ఉన్నతపాఠశాలలో మండల విద్యాధికారి రాంచందర్ హాజరయ్యారు. పాఠశాలలో గణతంత్ర వేడుకల్లో భాగంగా పిరమిడ్స్, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఆసిఫాబాద్ టౌన్‌లో
పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రసాద్, ఎంపిడివో కార్యాలయంలో శ్రీనివాస్, ఎంఈవో కార్యాలయంలో ఉదయ్‌బాబు, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ నరేష్‌కుమార్, ఆసిఫాబాద్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఈవో క్రిష్ణమూర్తి, ఎమ్మెల్యే నివాసం వద్ద తెరాసా పార్టి మండల అద్యక్షుడు శ్రీనివాస్, ప్రైవేటు ఆర్‌ఎంపి ఆండ్ పిఎంపీ ఆసోసియోషన్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జెండాను ఎగరవేశారు.