Wednesday, April 24, 2024

ఆరో రౌండ్ మిలిటరీ చర్చల్లో కొండల వద్ద ఉద్రిక్తతలపై దృష్టి

- Advertisement -
- Advertisement -

సంప్రదింపుల కొనసాగింపునకు భారత్-చైనా అంగీకారం

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాభారత్ మధ్య ఆరో రౌండ్ మిలిటరీస్థాయి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు సాగిన ఈ చర్చ ల్లో తూర్పు లడఖ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలోని వివాదాస్పద పాయింట్ల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై దృష్టి సారించినట్టు మంగళవారం సంబంధిత వర్గాలు తెలిపా యి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ చర్చలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. అయితే, సంప్రదింపులు కొనసాగిం చేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని ఆ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఎసి వద్ద ఉద్రిక్తతలు తగ్గించడంపైనే దృష్టి సారించినట్టు భారత వర్గాలు తెలిపాయి. ముందుగా చైనా దళాలు అన్ని పాయింట్లలోనూ యథాతథ స్థానాల్లోకి వెళ్లాలని పట్టుపట్టినట్టు తెలిపా యి. సెప్టెంబర్ 10న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మాస్కోలో జరిగిన సమావేశంలో ఐదు అంశాలపై ఏకాభిప్రాయానికొచ్చా రు. అయితే, కాలపరిమితిలో అమలు జరిపేలా తుది ఒప్పందం చేసుకోవాలని భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను గౌరవించాలని భారత్ డిమాండ్ చేసింది. దీనిపై మరోసారి చర్చలకు ఎజెండా ఖరారు చేయాల్సి ఉన్నది.

తాజాగా ఎల్‌ఎసి వద్ద చైనా సైడ్‌లో ఉన్న మోల్డోలో జరిగిన చర్చ ల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్‌సింగ్ నేతృత్వం వహించారు. లెహ్‌లోని 14 కార్ప్‌కు ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. మిలిటరీస్థాయి చర్చ ల్లో మొదటిసారి విదేశాంగశాఖ జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. చలికాలం సమీపిస్తున్న వేళ ఇరు దేశాల సైన్యాలకు కొండ ప్రాంతంలో గస్తీ నిర్వహించడం ఇబ్బందికర పరిస్థితేనని ఈ చర్చల్లో ఇరు పక్షాలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అక్టోబర్‌లో లడఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలకు పడిపోతుంది. ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇప్పటి వరకూ ఐదుసార్లు జరిగిన కార్ప్ కమాండర్‌స్థాయి చర్చల్లో తూర్పు లడఖ్‌లోని అన్ని పాయింట్ల వద్ద చైనా సైన్యం ఏప్రిల్‌కు ముందునాటి స్థానాల్లోకి వెళ్లాలని భారత్ డిమాండ్ చేసింది.

India-China agree to plan for Standoff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News