Wednesday, April 24, 2024

సూకీకి జైలు శిక్షపై భారత్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

India concerned over Aung San Suu Kyi imprisonment

 

న్యూఢిల్లీ: పదవీచ్యుత మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి కారాగార శిక్ష విధింపుపై తాము కలత చెందుతున్నట్లు భారత్ తెలియచేసింది. మయన్మార్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ, చట్టాల పరిరక్షణ జరగాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బగ్చి పిలుపునిచ్చారు. దేశంలో అసమ్మతిని రెచ్చగొట్టారన్న ఆరోపణలపై సూకీతోపాటు మరికొందరిని నాలుగేళ్ల కారాగార శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు ఇటీవలతీర్పు వెలువరించింది. కాగా..నాలుగేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలపై తాము కలత చెందుతున్నట్లు బగ్చి మంగళవారం తెలిపారు. మయన్మార్‌లో ప్రజాస్వామిక మార్పిడిని భారత్ ఒక పొరుగు దేశంగా ముందునుంచి బలపరుస్తోందని ఆయన చెప్పారు. ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్చల ప్రక్రియ ముందుకు సాగేలా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1న తిరుగుబాటు ద్వారా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న దరిమిలా మయన్మార్‌లో పెల్లుబికిన నిరసనలలో పిల్లలతోసహా వందలాది మంది ప్రజలు మరణించారు. ఈ తిరుగుబాటు అనంతరం సైన్యం నిర్బంధించిన ముఖ్య నేతలలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కూడా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News