Friday, April 26, 2024

24 గంటల్లో 24,850 కేసులు… 613 మంది మృతి

- Advertisement -
- Advertisement -

India corona cases list

 

ఢిల్లీ: కరోనా వైరస్ భారత్‌ను గడ గడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి మహా నగరాలు అతలాకుతలమవుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గంటకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో సోమవారం 24,850 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజే కరోనాతో 613 మంది మృత్యువాతపడ్డారు. భారత్ కరోనా కేసుల సంఖ్య 6.74 లక్షలకు చేరుకోగా 19288 మంది చనిపోయారు. కరోనా నుంచి 4.09 లక్షల మంది కోలుకోగా 2.45 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 97.89 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. 29.35 లక్షల కరోనా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా బ్రెజిల్ 15.78 లక్షలతో రెండో స్థానంలో ఉంది. రష్యా 6.74 లక్షలతో మూడో స్థానంలో ఉండగా భారత్ నాల్గో స్థానంలో ఉంది. భారత్ కంటే రష్యాలో రెండు వందల కేసులు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News