Friday, April 26, 2024

రికవరీలు భారత్ లోనే ఎక్కువ….

- Advertisement -
- Advertisement -

India coronavirus cases and recover

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా వైరస్ ధాటికి మహానగరాలు గజ గజ వణికిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి దాదాపుగా ప్రతీ రోజు 85 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 82,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1039 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60.74 లక్షలకు చేరుకోగా 95,542 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 51.16 లక్షల మంది కోలుకోగా 9.62 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 75 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 12 రోజుల్లోనే 10 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 82.58 శాతంగా ఉండగా మరణాల రేటు 1.57 శాతంగా ఉంది. ఆదివారం ఒక్క రోజే 7.09 లక్షల మంది కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. ప్రపంచంలో కరోనా నుంచి కోలుకున్నవారిలో భారత్ (50.16 లక్షలు) తొలి స్థానంలో ఉండగా అమెరికా (45.6 లక్షలు) రెండో స్థానం, బ్రెజిల్ (40.6 లక్షలు) మూడో స్థానంలో ఉంది.  భారత్ లో కరోనా టెస్టుల సంఖ్య 7.19 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News