Friday, March 29, 2024

39 వేలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

 దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
 24 గంటల్లో 857 మంది మృతి
 కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
 బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 52,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బుధవారం నాటికి మొత్తం కేసులు 19,08,254 కు చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లో 857 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 39,795 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. 12,62,000 మంది కోలుకోగా, ఇంకా యాక్టివ్ కేసులు (క్రియాశీల కేసులు) ఐదు లక్షల వరకు ఉన్నాయని వివరించింది. గత ఏడు రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా మరణించిన 657 మందిలో మహారాష్ట్రలో 300,కర్నాటకలో 100, తమిళనాడులో 108, ఆంధ్రప్రదేశ్‌లో 67, పశ్చిమబెంగాల్‌లో 54, ఉత్తరప్రదేశ్‌లో 39, గుజరాత్‌లో 25, పంజాబ్‌లో 20, రాజస్థాన్, బీహార్‌లో చెరో 17 మంది , తెలంగాణలో 13, మధ్యప్రదేశ్, డిల్లీలో చెరో 12 మంది, జమ్ముకశ్మీర్‌లో 10 మంది, ఒడిశాలో 9, చత్తీస్‌గఢ్, హర్యానాలో చెరో 8, అసోంలో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 4, కేరళ, జార్ఖండ్‌ల్లో చెరో ముగ్గురు, అండమాన్ నికోబార్‌దీవులు, పుదుచ్చేరి, త్రిపురల్లో ఇద్దరేసి వంతున, చండీగఢ్‌లో ఒకరు వంతున మృతి చెందారు.

మొత్తం మృతులు 39,795 మందిలో మహారాష్ట్రలో అత్యధికంగా 16,142 మంది మృతి చెందగా, తరువాత తమిళనాడులో అధికంగా 4349 ఢిల్లీలో 4033, కర్నాటకలో 2704, గుజరాత్‌లో 2533, ఉత్తర ప్రదేశ్‌లో 1817, పశ్చిమబెంగాల్‌లో 1785, ఆంధ్రలో 1604 మంది మధ్యప్రదేశ్‌లో 962 మంది మృతి చెందారు. ఇంతవరకు రాజస్థాన్‌లో 732, తెలంగాణలో 576, పంజాబ్‌లో 462, హర్యానాలో 448, జమ్ముకశ్మీర్‌లో 417, బీహార్‌లో 347, ఒడిశాలో 216, జార్ఖండ్‌లో 128, అసోంలో 115, ఉత్తరాఖండ్‌లో 95, కేరళలో 87 మంది మృతి చెందారు. చత్తీస్‌గడ్‌లో 68, గోవాలో 60, పుదుచ్చేరిలో 58, త్రిపురలో 30, చండీగడ్‌లో 20, హిమాచల్‌ప్రదేశ్‌లో 14, అండమాన్ నికోబార్ లో 12, లడఖ్, మణిపూర్‌లో చెరో ఏడు, మేఘాలయ, నాగాలాండ్ లో చెరో ఐదు, అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు, దాద్రా, నగర్‌హవేలీ, డామన్, డయ్యూ, సిక్కిం, లో ఒక్కొక్కరు వంతున మృతి చెందారు.

గత 14 రోజుల్లో కోలుకున్న వారి రేటు 63.8 శాతం నుంచి 67.19 శాతానికి పెరిగింది. ఈమేరకు బుధవారం ఈ ఫలితాలు కనిపించాయి. మరణాల రేటు 2.09 శాతం వరకు తగ్గింది. గత 24 గంటల్లో మొత్తం 51,706 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజులో కోలుకున్న వారి సంఖ్యతో పోల్చిచూడగా ఇదే అత్యధికంగా తేలింది. కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 19,08,254 పాజిటివ్ కేసుల్లో 12,82,215 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తేలింది. ప్రస్తుతం 5.86,244 మంది చికిత్స పొందుతుండగా, 39,795 మంది మృతి చెందారు. రికార్డు స్థాయిలో రికవరీ శాతం కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,244కు తగ్గింది. కేసుల భారం 30.72 శాతానికి పరిమితమైంది. పరీక్షించడం, పసిగట్టడం, చికిత్స చేయడం ఈ మూడు రకాల వ్యూహంతో అనుకున్న ఫలితాలు వచ్చాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్రంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో దీన్ని సాధించగలిగామని వివరించింది. ప్రపంచ దృష్టాంతంతో పోలిస్తే మరణాల శాతం చాలావరకు తగ్గిందని పేర్కొంది. రికవరీలో స్థిరమైన పెరుగుదల వల్ల యాక్టివ్ కేసులను దాదాపు 7 లక్షల వరకు అధిగమించ గలిగామని పేర్కొంది. మంగళవారం దేశంలో 6,19,652 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో నిన్నటికి మొత్తం 2,14,84,402 శాంపిళ్లు పరీక్షించడమైంది. ప్రతి పది లక్షల మందికి 15,568 వరకు పరీక్షించడం జరుగుతోంది. పరీక్షల సామర్థం దేశంలో పెరుగుతోంది. మొత్తం 1366 ప్రయోగశాలల్లో ప్రభుత్వరంగంలో 920 ఉండగా, ప్రైవేట్ ప్రయోగశాలలు 446 వరకు ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 52,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మృతి చెందిన వారు 857 మంది అని నమోదైంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 39,795 కు చేరుకుంది.

India crosses 39000 Corona deaths

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News