Home తాజా వార్తలు భారత్ భళా

భారత్ భళా

India
చెలరేగిన షమి, అశ్విన్ మ్యాజిక్, బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ విజయం

ఇండోర్: టెస్టుల్లో టీమిండియా మరో భారీ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని దక్కించుకుంది. కోహ్లి సేన మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శనివారం మూడో రోజు భారత్ బ్యాటింగ్‌కు దిగలేదు. ఓవర్‌నైట్ స్కోరు 493/6 వద్దే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టింది. ఈసారి కూడా భారత బౌలర్లు చెలరేగి పోయారు. దీంతో బంగ్లాదేశ్ 213 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం మూట గట్టుకుంది. స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి నాలుగు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను శాసించాడు. అశ్విన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఇంతకుముందు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి తనకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.

ఆరంభంలోనే

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన పర్యాటక బంగ్లాదేశ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇమ్రుల్ కైస్, షద్మన్ ఇస్లాం మరోసారి నిరాశ పరిచారు. కైస్ (6)ను ఉమేశ్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు షద్మన్ (6)ను ఇషాంత్ ఇంటిదారి బట్టాడు. ఇషాంత్ వేసిన అద్భుత బంతికి షద్మన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ మోమినుల్ హక్ కూడా నిరాశే మిగిల్చాడు. ఏడు పరుగులు చేసిన హక్‌ను మహ్మద్ షమి ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇక, మహ్మద్ మిథున్ (18), మహ్మదుల్లా (15) కూడా జట్టును ఆదుకోలేక పోయారు. భారత బౌలర్లు చెలరేగి పోవడంతో బంగ్లాదేశ్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమేనని అందరూ భావించారు.

రహీం ఒంటరి పోరాటం

ఈ దశలో సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం అద్భుత బ్యాటింగ్‌తో కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రహీరం పోరాటం కొనసాగించాడు. అతనికి వికెట్ కీపర్ లిటన్ దాస్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అంతేగాక జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు కాస్త నిరీక్షించక తప్పలేదు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన 39 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఆరో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారిన దాస్‌ను అశ్విన్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన మెహదీ హసన్ అండతో రహీం మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచేందుకు ప్రయత్నించారు. కాగా, ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 38 పరుగులు చేసి ఉమేశ్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కొంత సేపట్లోనే ముగిసింది. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన రహీం 150 బంతుల్లో ఏడు ఫోర్లతో 64 పరుగులు చేశాడు.

రికార్డు విజయం

బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ విజయం సాధించడంతో టీమిండియా తన ఖాతాలో అరుదైన రికార్డును నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సార్లు ఇన్నింగ్స్ విజయాలు సాధించడం భారత్‌కు ఇది మూడోసారి. గతంలో కూడా రెండు సార్లు భారత్ ఇటువంటి ఫీట్‌ను సాధించింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాలు అందుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీంతో భారత టెస్టు చరిత్రలో ఇలా మూడు సార్లు ఈ అరుదైన ఫీట్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. తొలిసారి 199293లో భారత్ వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించింది. అంతేగాక 199394లో కూడా ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఏడాది కూడా ఇలాంటి రికార్డునే నమోదు చేసింది.

స్కోరు బోర్డు
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: షద్మన్ ఇస్లాం (సి) సాహా (బి) ఇషాంత్ 6, ఇమ్రుల్ కైస్ (సి) రహానె (బి) ఉమేశ్ 6, మోమినుల్ హక్ (బి) అశ్విన్ 37, మహ్మద్ మిథున్ ఎల్బీబి షమి 13, ముష్ఫికుర్ రహీం (బి) షమి 43, మహ్మదుల్లా (బి) అశ్విన్ 10, లిటన్ దాస్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 21, మెహదీ హసన్ ఎల్బీబి షమి 0, తైజుల్ ఇస్లాం రనౌట్ 1, అబు జాయెద్ నాటౌట్ 7, ఎబాదత్ హుస్సేన్ (బి) ఉమేశ్ 4, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 58.3 ఓవర్లలో 150 ఆలౌట్.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 126202, ఉమేశ్ యాదవ్ 14.33472, మహ్మద్ షమి 135273, రవిచంద్రన్ అశ్విన్ 116432, రవీంద్ర జడేజా 30100.
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) జాయెద్ (బి) మెహదీ హసన్ 243, రోహిత్ శర్మ (సి) లిటన్ దాస్ (బి) అబు జాయెద్ 6, చటేశ్వర్ పుజారా (సి) సైఫ్ (బి) అబు జాయెద్ 54, విరాట్ కోహ్లి ఎల్బీబి అబు జాయెద్ 0, అజింక్య రహానె (సి) తైజుల్ ఇస్లాం (బి) అబు జాయెద్ 86, రవీంద్ర జడేజా (నాటౌట్) 60, వృద్ధిమాన్ సాహా (బి) ఎబాదత్ హుస్సేన్ 12, ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 25, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 114 ఓవర్లలో 493/6 డిక్లేర్డ్.
బౌలింగ్: ఎబాదత్ హుస్సేన్ 3151151, అబు జాయెద్ 2531084, తైజుల్ ఇస్లాం 2841200, మెహదీ హసన్ 2701251, మహ్మదుల్లా 30240.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షద్మన్ ఇస్లాం (బి) ఇషాంత్ 6, ఇమ్రుల్ కైస్ (బి) ఉమేశ్ 6, మోమినుల్ హక్ ఎల్బీబి మహ్మద్ షమి 7, మహ్మద్ మిథున్ (సి) మయాంక్ (బి) షమి 18, ముష్ఫికుర్ రహీం (సి) పుజారా (బి) అశ్విన్ 64, మహ్మదుల్లా (సి) రోహిత్ (బి) షమి 15, లిటన్ దాస్ (సి) అండ్ (బి) అశ్విన్ 35, మెహదీ హసన్ (బి) ఉమేశ్ 38, తైజుల్ ఇస్లాం (సి) సాహా (బి) షమి 6, అబు జాయెద్ నాటౌట్ 4, ఎబాదత్ హుస్సేన్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 1, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 69.2 ఓవర్లలో 213 ఆలౌట్.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 113311, ఉమేశ్ యాదవ్ 141512, మహ్మద్ షమి 167314, రవీంద్ర జడేజా 142470, రవిచంద్రన్ అశ్విన్ 14.26423.

India crush Bangladesh by an innings and 130 runs