Home తాజా వార్తలు ఏప్రిల్‌లో పెరిగిన ఎగుమతులు

ఏప్రిల్‌లో పెరిగిన ఎగుమతులు

India exports rose to $ 30.21 billion in April

 

గత నెలలో 30.21 బిలియన్ డాలర్లు నమోదు
15.24 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్య లోటు

న్యూఢిల్లీ : ఏప్రిల్‌లో భారతీయ ఎగుమతులు 30.21 బిలియన్ డాలర్లతో మూడు రెట్లు పెరిగాయి. ఇంజినీరింగ్, జెమ్స్ ఇండ్ జువెలరీ, పెట్రోలియం ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధి కారణంగా ఈసారి ఎగుమతులు బాగున్నాయి. అయినా వాణిజ్య లోటు 15.24 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రాథమిక గణాంకాలను ఆదివారం విడుదల చేసింది. అయితే గతేడాది (2020) ఏప్రిల్‌లో దేశీయ ఎగుమతులు 10.17 బిలియన్ డాలర్లు ఉండగా, వాణిజ్య లోటు 6.92 బిలియన్ డాలర్లు ఉంది. 2021 ఏప్రిల్‌లో దిగుమతులు 45.45 బిలియన్ డాలర్లతో మూడు రెట్లు పెరిగాయి.

2020 ఏప్రిల్‌లో దిగుమతులు 17.09 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. శాతం పరంగా చూస్తే, ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి రేటు రికార్డు స్థాయిలో గరిష్టంలో ఉంది. దీనికి కారణంగా గతేడాది ఏప్రిల్ నెలలో కోవిడ్19 మహమ్మారి కారణంగా ఎగుమతులు 60.28 శాతం పడిపోయాయి. అయితే ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు 34.4 బిలియన్ డాలర్లతో 60.29 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్‌లో చమురు దిగుమతులు 10.8 బిలియన్ డాలర్లు, అయితే గతేడాది ఇదే నెలలో వీటి దిగుమతులు 4.65 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి.

India exports rose to $ 30.21 billion in April