Tuesday, April 23, 2024

తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ (కేరళ): కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించారు.ఈ సంఘటన బహుశా దేశంలోనే మొదటిది కావచ్చు. జియా పావల్ ఒక డ్యాన్సర్. తన జీవిత భాగస్వామిని జహాద్ ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి అని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఒక బిడ్డకు తల్లిదండ్రులం కావాలని తాము కన్నకలలు ఇప్పుడు నిజమౌతున్నాయని జియా పావల్ వెల్లడించారు. వీరిద్దరూ మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జన్మతః పురుషుడైన జియా తరువాత స్త్రీగా మారాడు.

జన్మతః స్త్రీ అయిన జహాద్ తరువాత పురుషుడుగా మారింది. ఈ సందర్భంగా మీడియాతో జియా పావల్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ సమాజం భయం కలిగించే సమాజంలో బతుకుతోందని, సమాజం తమ గురించి ఏం ఆలోచిస్తుందో అన్న చింత కలుగుతోందని చెప్పారు. అనేక మంది ట్రాన్స్‌జెండర్లు తల్లిదండ్రులవ్వాలన్న కోరికతో ఉంటున్నారని , గర్భం దాల్చే అవకాశం ఉన్నా వారు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. వీరిద్దరూ గత రెండు రోజులుగా అనేక మీడియా వారికి ఇంటర్వూలు ఇస్తూనే ఉన్నారు. లింగమార్పిడి ప్రక్రియ దిశగా తమ ప్రయాణం సాగుతుందని, అయితే బిడ్డకు జన్మ నివ్వాలన్న తలంపుతో హార్మోన్ చికిత్సను తాత్కాలికంగా ఆపామని చెప్పారు.

ఇలా జరుగుతుందని తాను అనుకోలేదని, అలా అనుకుని ఉంటే వక్షోజాలను తొలగించి ఉండేదాన్ని కాదని జహాద్ చెప్పారు. మొదట్లో వీరు ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. ఇద్దరి ట్రాన్స్‌జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తికానందున పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని, అంతా సాధారణం గానే జరుగుతుందని కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News