Home తాజా వార్తలు ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు 7.6%

ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు 7.6%

India FY23 GDP growth seen 7.6%

 

ఇండియా రేటింగ్స్ అంచనా

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23)లో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 7.6 శాతానికి పెరగొచ్చని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ అంచనా వేసింది. భారత్ ప్రభుత్వం వ్యయాల కొనసాగింపు, సానుకూల గ్లోబల్ ట్రేడ్ దృక్పథంతో జిడిపి మెరుగ్గా ఉండనుందని ఏజెన్సీ తెలిపింది. ఇండియా రేటింగ్స్‌తో ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సునీల్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, రెండేళ్ల విరామం తర్వాత దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగైంది. 2022-23లో వాస్తవ జిడిపి 2019-20 (కోవిడ్‌కు ముందు స్థాయి) కంటే 9.1 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ జిడిపి 10.2 శాతంగా, అంటే 2022-23 కంటే దిగువన ఉండనుందని అన్నారు. ఈ కొరతకు ప్రధాన కారణం ప్రైవేట్ వినియోగం, పెట్టుబడి డిమాండ్ తగ్గడమే అని నివేదిక పేర్కొంది. మొత్తం క్షీణతలో ప్రైవేట్ వినియోగం వాటా 43.4 శాతం, పెట్టుబడి డిమాండ్ 21 శాతం ఉంటుందని సంస్థ తెలిపింది. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇస్తాయని కుమార్ సిన్హా అన్నారు. ఆర్థిక స్థిరీకరణపై ప్రభుత్వం తొందరపడడం లేదని ఆయన అన్నారు. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యలోటు అధికంగానే ఉండనుందని తెలిపారు.

India FY23 GDP growth seen 7.6%