Home తాజా వార్తలు క్యూ2లో జిడిపి 8.4 శాతం

క్యూ2లో జిడిపి 8.4 శాతం

India GDP growth grows by 8.4 percent in Q2

 

గతేడాదితో పోలిస్తే పెరిగింది..
వెల్లడించిన ప్రభుత్వ గణాంకాల శాఖ

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) రెండో త్రైమాసికంలో దేశీయ జిడిపి (స్థూల జాతీయోత్పత్తి) 8.4 శాతం నమోదు చేసింది. అయితే కరోనా మహమ్మారి ముందు స్థాయిని జిడిపి అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 20.1 శాతంగా ఉంది. అంటే మొదటి త్రైమాసికంతో పోలిస్తే తగ్గింది. కానీ గతేడాదితో పోలిస్తే పెరిగింది. గతేడాది ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 24.4 శాతానికి క్షీణించింది. ఇక 2020-21 జూలైసెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో జిడిపి మైనస్ 7.4 శాతంగా ఉందని ఎన్‌ఎస్‌ఒ (జాతీయ గణాంకాల శాఖ) విడుదల చేసిన డేటా వెల్లడించింది. 2020-21 రెండో త్రైమాసికంలో జిడిపి రూ.32.97 లక్షల కోట్లతో పోలిస్తే 2021-22లో 35.73 లక్షల కోట్లు అంచనా వేశారు. 2020-21లో 7.4 శాతంతో పోలిస్తే 8.4 శాతం నమోదైంది.

రేటింగ్ సంస్థల అంచనాలు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రెండో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.9 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతకుముందు ఇది 7.7 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవ జిడిపి వృద్ధి 7.9 శాతం ఉండవచ్చని పేర్కొంది. భారతదేశ జిడిపి వృద్ధి 8,9 శాతం మధ్య ఉండవచ్చని యుబిఎస్ భావిస్తోంది. ఇక దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జిడిపి వృద్ధి రేటు 8.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ వృద్ధిరేటు ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. అయితే ద్రవ్యోEconomy, Indiaల్బణం ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ఎలారా క్యాపిటల్ 9 శాతం వృద్ధిని, సిటీ బ్యాంక్ 8.7 శాతం వృద్ధిని అంచనా వేసింది.

ఆర్‌బిఐ సమీక్షపై ప్రభావం
ప్రస్తుత జిడిపి గణాంకాలు ఆర్‌బిఐ సమీక్షపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు వృద్ధి రేటు పెరగడంలో దోహదం చేస్తున్నాయి. పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. త్వరలో జరిగే ఆర్‌బిఐ సమీక్షపై జిడిపి గణాంకాల ప్రభావం ఉండనుంది.                      – కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఎకనమిస్ట్ సువోదీప్ రక్షిత్

పటిష్టంగా వృద్ధి రేటు
క్యూ2 (జూలై-సెప్టెంబర్)లో జిడిపి అంచనాలకు అనుగుణంగానే ఉంది. వస్తువుల ధరలు పెరగడం జిడిపి గణాంకాలపై ప్రభావం చూపాయి. వచ్చే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. జిడిపి విషయంలో భారత్‌కు ఇది సానుకూల వార్త, ఎందుకంటే జిడిపి వృద్ధి రేటు పటిష్టంగా ఉంది.                         – ల్యాడరప్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండి రాఘవేంద్ర నాథ్

నిలకడగా వృద్ధి రేటు
భారతదేశం జిడిపి వృద్ధి రేటు క్యూ2లో 8.4 శాతం నమోదు కావడం మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉంది. గతేడాది మూడో త్రైమాసికంలో అత్యధిక వృద్ధి రేటు కనిపించింది. 2 సంవత్సరాల కాగర్ ఆధారంగా చూస్తే ఇది ఫ్లాట్‌గా ఉంది. అంచనా కంటే ప్రైవేటు వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది, పెట్టుబడులు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి.
మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎకనమిస్ట్ నిఖిల్ గుప్తా

ఈ ఏడాదిలో రెండంకెలకు వృద్ధి రేటు
డిమాండ్ పెరగడం, బ్యాంకింగ్ రంగం వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) జిడిపి రెండంకెలకు చేరుకోనుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. తర్వాతి సంవత్సరం(2023)లో 7 శాతం వృద్ధిని రేటును నమోదు చేసే అవకాశముందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశీయ వృద్ధి దోహదం చేస్తున్నాయని అన్నారు.                                                         – ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణ్యం

ద్రవ్యలోటు రూ.5.47 లక్షల కోట్లు
పూర్తి సంవత్సరం బడ్జెట్ లక్ష్యంతో పోలిస్తే ఏప్రిల్‌అక్టోబర్ మధ్య ద్రవ్య లోటు 36.3 శాతం లేదా రూ. 5.47 లక్షల కోట్లుగా ఉంది. మంగళవారం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, నికర పన్ను వసూళ్లు రూ.10.53 లక్షల కోట్లు, అదే సమయంలో మొత్తం వ్యయం రూ.18.27 లక్షల కోట్లు ఉంది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయం, వ్యయాకి మధ్య వ్యత్యాసం. గతేడాది ద్రవ్యలోటు 119.7 శాతంగా ఉంది. ఈ పూర్తి సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యాన్ని 6.8 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది ప్రభుత్వానికి సాధ్యం కాబోదని నిపుణులు పేర్కొంటున్నారు. 2020లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో మైనస్ 24.4 శాతానికి పడిపోయింది. అయితే ఇది మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్ నుండి నవంబర్ వరకు 0.4 శాతం వృద్ధిని చూపింది. ఇక 2021 జనవరి నుండి మార్చి వరకు జిడిపి 1.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. 2021 ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 20.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.

7.5%కి పెరిగిన కీలక రంగాల ఉత్పత్తి
ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి అక్టోబర్ నెలలో 7.5 శాతానికి పెరిగింది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాలు అక్టోబర్‌లో ఆరోగ్యకరమైన పనితీరును చూపాయి. అయితే గతేడాది(2020) అక్టోబర్‌లో పారిశ్రామి ఉత్పత్తి సూచీ 0.5 శాతంగా ఉంది. 2021 అక్టోబర్‌లో కీలక రంగాల వృద్ధి 136.2తో 7.5 శాతం పెరిగింది. ఈ కీలక రంగాల్లో బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, విద్యుత్ వంటి పరిశ్రమలు ఉన్నాయి.

India GDP growth grows by 8.4 percent in Q2