Saturday, April 20, 2024

సెమీస్‌లో భారత్

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్:ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్2లో దాయాదులు భారత్, పాకిస్థాన్ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఆదివారం టీమిండియా జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 71పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 35బంతుల్లో 51పరుగులు, సూర్యకుమార్ 6ఫోర్లు, 61పరుగులు చేసి అలరించారు. మరోవైపు భారత్ బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో జింబాబ్వే 187పరుగుల లక్షఛేదనలో 115 పరుగులకే కుప్పకూలింది. ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించి అజేయంగా నిలిచిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సూర్య మెరుపులు

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తొలుత గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, రాహుల్ జోడీ ఇన్నింగ్స్ ఆరంభించింది. హిట్‌మ్యాన్ రోహిత్ మరోసారి పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. 13బంతుల్లో రెండు ఫోర్లుతో 15పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ 26పరుగులు చేసి దినేశ్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన (3) నిరాశపరిచాడు. అయితే రాహుల్, సూర్య ఆదుకుని పటిష్ఠ స్థితిలో నిలిపారు. ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య రెండు బౌండరీలతో 18పరుగులు చేశాడు. మొత్తంమీద భారత్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి చేసింది. అనంతరం నిర్దేశించిన లక్షఛేదనలో జింబాబ్వే తడబాటుకు గురైంది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా కట్టడి చేయడంతో జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యాన్ని విఫలమయ్యారు. మొత్తంమీద చేసి ఆలౌటైంది.టీమిండియా బౌలర్లందరూ వికెట్ సాధించి అభిమానులను అలరించారు. అశ్విన్ 3వికెట్లు తీయగా, రెండు వికెట్లు పడగొట్టారు. అదేవిధంగా అర్షదీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో భారతజట్టు అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల జరిగే ఇంగ్లండ్‌తో రోహిత్‌సేన తలపడనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News