Home తాజా వార్తలు గృహ ధరల సూచీలో 12 స్థానాలు తగ్గిన భారత్

గృహ ధరల సూచీలో 12 స్థానాలు తగ్గిన భారత్

India has moved down 12 places in global home price index

 

55వ ర్యాంక్‌కు పడిపోయిన ఇండియా
గృహాల ధరలు సంవత్సరంలో 1.6% తగ్గాయి: నైట్‌ఫ్రాంక్ నివేదిక

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా గృహ ధరల విషయంలో భారతదేశం 12 స్థానాలు పడిపోయింది. గృహాల ధరలు క్రమంగా తగ్గడం వల్ల భారత్ ర్యాంక్ తగ్గింది. 2021 మొదటి త్రైమాసికంలో గృహ ధరల సూచీ జాబితాలో భారతదేశం 55వ స్థానంలో ఉంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, 2020 మొదటి త్రైమాసికంలో భారతదేశం 43 వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది (2021) ఇదే కాలంలో భారత్ 12 స్థానాలు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 56 దేశాలు సూచీలో ఉన్నాయి. గృహాల ధరలు వార్షికంగా 1.6 శాతం తగ్గాయి. అయితే 2020 మూడో త్రైమాసికం నుంచి 2021 మొదటి త్రైమాసికం మధ్య కాలంలో ఇంటి ధరలు 0.6 శాతం పెరిగాయి. అదేవిధంగా 2020 నాలుగో త్రైమాసికం(క్యూ4) నుంచి 2021 మొదటి త్రైమాసికం(క్యూ1) మధ్య గృహాల ధరలు 1.4 శాతం పెరిగాయి. అమెరికాలో ఇళ్ల ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 13.2 శాతం పెరిగాయి.

అగ్రస్థానంలో టర్కీ
వార్షిక ప్రాతిపదికన గృహ ద్రవ్యోల్బణం విషయంలో టర్కీ వరుసగా ఐదోసారి అన్నింటినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరలు 32 శాతం పెరిగాయి. అదేవిధంగా న్యూజిలాండ్‌లో 22.1 శాతం, లక్సెంబర్గ్‌లో 16.6 శాతం ఖరీదు అయ్యాయి. స్పెయిన్ దిగువకు పడిపోగా, ఇంటి ధరలు గత ఏడాదితో పోలిస్తే 1.8 శాతం తగ్గాయి.

India has moved down 12 places in global home price index